యావత్ ప్రపంచాన్నే కలవరపెడుతున్న కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలోను విస్తృతంగా విస్తరిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కరోనా మహమ్మారి ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రాణాలు మింగేస్తున్నప్పటికీ ఇతర వ్యాదుల తోనూ ఇతర కారణాలతోనూ అనేకమంది మరణిస్తూనే ఉన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది తమ దృష్టాంతా కేవలం కరోనా పైనే చూపుతున్నారని ఇతర రోగులపై సరైన దృష్టి వహించడం లేదని నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అంబులెన్స్ నిర్లక్ష్యం మూలానా వైద్య సిబ్బంది అసమర్దత కారణంగా ఆసుపత్రుల్లో అంబులెన్స్ లలో   వసతులు లేక ఎందరో మరణిస్తున్నారు.. తాజాగా నమోదు అవుతున్న కేసులే ఇందుకు నిదర్శనం పలుకుతున్నాయి. మేదక్ జిల్లాలో ఓ వ్యక్తి మరణించడానికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణం అనడంలో ఎటు వంటి సందేహం లేదు.

 

సరైన వైద్యం అవసర సమయంలో లభించక, అంబులెన్స్ సిబ్బంది వహించిన నిర్లక్ష్య దొరణితో మేదక్ జిల్లాలో శ్రీనివాస్ బాబు అనే 52 ఏళ్ల వ్యక్తి మరణించాడు. వివరాల్లోకి వెళితే.. శ్రీనివాస్ బాబు సికింద్రాబాద్ కి చందిన వ్యక్తి, విదులు  నిర్వహించేందుకు కామారెడ్డి కి వెళ్లాడు, అనంతరం అక్కడనుండి తిరిగి హైదరాబాదుకు వస్తుండగా శ్వాస సమస్య తలెత్తింది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారేసరికి మేదక్ జిల్లాలో బస్సు దిగాడు. అక్కడనుండి ఆసుపత్రికి నడుస్తూ వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకులాడు. అది గమనించిన పోలీసులు సదరు వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఏం జరిగింది అని అడగగా శ్రీనివాస్ తన వివరాలు చెప్పి అంబులెన్స్ ని పిలిపించమని కోరాడు. అంబులెన్సుకు ఫోన్ చేసి గంటకు పైగా గడుస్తున్నప్పటికీ అంబులెన్సు అక్కడికి చేరుకోలేదు. తీరికగా అక్కడికి వచ్చిన అంబులెన్సులో సరైన పరికరాలు లేక పి‌పి‌ఈ కిట్లు కూడా లేక అతనికి సరైన వైద్యం అందలేదు.. వైద్యం దక్కని శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించాడు.

 

అంబులెన్స్ ముఖ్య లక్ష్యం ప్రమాదకర సమయంలో సరైన వైద్యం అందించేలా చేయడం. 108 కి కాల్ చేసిన నిమిషాల పరిదిలో అంబులెన్స్ ను అందుబాటులో ఉండేలా చేయడం ప్రభుత్వ భాద్యత. పైగా అత్యవసర సమయాల్లో కార్డియాక్ అరెస్ట్ వంటి ప్రమాదాలు జరిగితే అంబులెన్స్ లో ఎక్కించుకున్న వెంటనే చికిత్స ప్రారంబించేస్తారు.. అందుకు అవసరమైన పి‌పి‌ఈ కిట్లను పరికరాలను అంబులెన్స్ లో అందుబాటులో ఉంచడం తప్పనిసరి.. ఇక శ్రీనివాస్ బాబు విషయంలో 108 కి కాల్ చేసిన గంటకు కూడా అంబులెన్స్ చేరుకోలేదంటే ఎవరిది తప్పు..? వచ్చిన అంబులెన్స్ లో సరైన సదుపాయాలు కూడా లేకపోతే ఎవరిది నిర్లక్ష్యం ఎవరిని ప్రశ్నించాలి..? మొన్న ఏప్రిల్ లో కూడా అంబులెన్స్ నిర్లక్ష్యం మూలాన ఓ బాలింత తన బిడ్డ ఇద్దరు మరణించారు అందుకు ఎవరిని ప్రశ్నించాలి..? ఇది ప్రభుత్వ వైఫల్యం అని వైద్య సిబ్బంది నిర్లక్ష్యమని అంటున్నారు సామాజిక బాధ్యత ఉన్న నిపుణులు, ప్రతిపక్ష నాయకులు. ఒకరి నిర్లక్ష్యం వల్ల మరొకరు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తలెత్తడం రాష్ట్రానికే అవమానమని ఎంతో బాదాకరం అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: