ఏడాది కాలంపాటు ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు ప్రతిపక్షమైన టీడీపీపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామలే ఇందుకు ఉదాహరణ. నిన్నటి అచ్చెన్నాయుడు అరెస్ట్ తర్వాత సాయంత్రానికి చింతమనేనిని అదుపులోకి తీసుకోవడం అలాగే ఈ రోజు ఉదయాన్నే జేసి ప్రభాకర్ రెడ్డి, అతని కొడుకు అస్మిత్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు పట్టుకొని వెళ్లడం చూస్తుంటే టీడీపీ నాయకుల గుండెల్లో గుబులు మొదలైంది.

 

ఎప్పుడు ఎవర్ని అరెస్టు చేస్తారో అర్ధంకాని పరిస్తితులలో ఉన్నారు టీడీపీ నాయకులు. జరుగుతున్న పరిణామాలపై టీడీపీ నేతలు గొంతుచించుకు అరుస్తున్నారు. అధినేత చంద్రబాబు ఏకంగా ఈ వ్యవహారంలోకి కులాన్నే లాగారు. కానీ, లాభం లేకుండా పోయింది. రాష్ట్రంలోని ఇతర ప్రతిపక్షాలు (జనసేన, బిజేపి) నేతలు చాలామంది వైసీపీ చర్యకు మద్దతు పలికారు. దీంతో బాబు అయోమయంలో పడిపోయారు. ఈ కేసు ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందోనన్న ఆలోచనలో బాబు పడ్డట్టు తెలుస్తుంది.

 

ఈ నేపధ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో చేసిన ఒక ట్వీట్  వైరల్ అవుతోంది. విజయసాయిరెడ్డి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని వేసిన ట్వీట్ లో ఇప్పుడే చంద్రబాబు తన ప్రాణ మిత్రుడికి ఫోన్ చేసి లండన్ లో ఎలా దాక్కోవాలి అన్నట్లు మరియు ఇండియా నుండి విజయవంతంగా ఎలా తప్పించుకోవాలని సమాచారం అడిగినట్లు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అలాగే చంద్రబాబు మిత్రుడిని బడా పారిశ్రామికవేత్త గా చెప్పిన విజయ్ సాయి రెడ్డి ఖచ్చితంగా అతను విజయ్ మాల్యా గురించే చెబుతున్నట్లు ప్రజానీకం భావిస్తోంది.

 

అయితే ఇక్కడ ప్రముఖంగా వినిపిస్తున్నది ఏంటంటే.. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎందరో నేతలను ఎదుర్కొన్నారు, బాబు అక్రమ ఆస్తులపై ఎన్నో విచారణలు కూడా జరిగాయి. కానీ ఎక్కడా బాబు అవినీతి బయటపడలేదు. బాబు అవినీతిని నిరూపించడం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్ల కూడా కాలేదు.. మరి అంతటి రాజకీయ పటిమ కలిగిన చంద్రబాబు అవినీతిని నిరూపించడం వైఎస్ జగన్ వల్ల అవుతుందా..? అంటే  ఈ ప్రశ్నకి కాలమే సమాధానం చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: