ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాత్మక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా..? సీఎం జగన్ కక్షపూరిత రాజకీయాలకు తెరలేపారా..? లేక, అవినీతి నిర్మూలన దిశగా సీఎం జగన్ తన అడుగులు వేస్తున్నారా..? అనే ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులతో పాటు ప్రజలను కూడా వెంటాడుతున్నాయి. మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఈఎస్ఐ స్కామ్ విషయంలో అరెస్టు చేయడం నిన్నటి నుండి రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆ వెంటనే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేనిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, అలాగే ఇవాళ ఉదయం 154 బస్సులు నకిలీ NOC, ఫేక్ ఇన్స్యూరెన్స్ కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌ రెడ్డిలను హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు.

 

దీంతో టీడీపీ నేతల గుండెల్లో గుబులు మొదలైంది. దానికి తోడు నిన్న ఒక మంత్రి మాట్లాడుతూ..మరిన్ని అరెస్టులకు సిద్ధంగా ఉండాల్సిందే” అని చెప్పడం. అలాగే ఇది ఆరంభం మాత్రమే అంటూ రోజా చెప్పడంతో మరిన్ని అరెస్టులు తప్పవని తెలుస్తుంది. ఇంతకు జగన్ జాబితాలో ఎవరెవరు ఉన్నారు..? వారిపై ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి..? అనే విషయాలు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం..

 

అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే విచారణకు ఒక సిట్ బృందం కూడా ఏర్పాటయింది. అలాగే సీఐడీ కూడా వేగంగా దర్యాప్తు చేస్తుంది. దానికితోడు ఇప్పటికే ఓ డిప్యూటీ కలెక్టర్ ని కూడా అరెస్టు చేసారు. అయితే ఈ స్కామ్ లో ప్రముఖంగా వినిపిస్తున్నవి  మాజీ మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడు పేర్లు.. దీంతో ఏ క్షణమైనా వీరిపై పోలీసుల పడే అవకాశం ఉంది.

 

అలాగే  నీటి ప్రాజెక్టుల టెండర్లు కేటాయింపు విషయంలో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి కేసులు నమోదు కాకపోయినా.. త్వరలోనే పోలవరం, వెలుగొండ, హంద్రీనీవా వంటి ప్రాజెక్టుల పనులపై లోతుగా ఒక విచారణ బృందాన్ని నియమించనున్నారని సమాచారం. దీంతో ఆ పార్టీకి బలమైన గొంతుగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమాకి చెక్ పడ్డట్టే.. అలాగే మరికొంతమంది సినీయర్లకు కూడా ఈ సెగ తగలడం ఖాయం.

 

అదేవిధంగా చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్‌ తోఫా, క్రిస్మస్‌ కానుక పథకాల్లో రూ.వందల కోట్లలో అవినీతి జరిగినట్లు ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటీ  నిర్ధారించింది. కాబట్టి మాజీమంత్రి పరిటాల సునీతకు చిక్కులు తప్పవని తెలుస్తుంది.

 

ఇలా చూసుకుంటూ పోతే.. మాన్సాస్ ట్రస్ట్ లో జరిగిన అక్రమాలలో అశోక గజపతి రాజు, కుటుంబరావు. ఇప్పటికే ఎన్నో కేసుల్లో చిక్కుకున్న చింతమనేని. టూరిజం కాంట్రాక్టుల్లో జరిగిన అక్రమాలపై భూమా అఖిలప్రియ. మైనింగ్ కేసుల్లో దామచర్ల. యరపతినేనిపై ఇప్పటికే సీబీఐ కేసు ఉంది. ఇంకా జగన్ లిస్టులో గంట, ఆలపాటి, కూన రవి కుమార్, అనగాని, ఇలా కొందరి పేర్లు ఉన్నట్టు సమాచారం. ఈ తలనొప్పులు ఎందుకని భావించి శిద్దా రాఘవరావు లాగా లొంగిపోయి, వైసీపీలో చేరితే సేఫ్ అయిపోవచ్చు అని కొందరు భావిస్తున్నారు. మరి అందరినీ చేర్చుకోవడం కష్టంతో కూడిన పని కాబట్టి సీఎం జగన్ ఎవరిని కనికరిస్తాడో చూడాలి. ఇక చంద్రబాబు, లోకేష్ విషయానికొస్తే.. ఎంతైనా వాళ్ళు పార్టీ అధినేతలు కదా.. కాబట్టి అన్నిట్లో వారి పాత్ర ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: