కరోనా ఎఫెక్ట్ సీఎం కేసిఆర్ కూతురు నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత పై కూడా పడింది. కరోన రాకతో ఇప్పటికే జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికలు వాయిదా పడ్డాయని, అలా వాయిదా పడితే పదవి కాలం కూడా సన్నగిల్లుతుందని కవిత తెగ బాధపడుతుందట..! ఇక కవిత దిగులు పడుతుందని గులాభి దళం అంతా క్రుంగిపోతుంది. కవితక్క దిగులు దూరం చేసే బాధ్యత గులాభి నేతలు తమ భుజాలపై వేసుకొని అక్కని మెప్పించేందుకు తెగ సన్నాహాలు చేస్తున్నారు. ఇక కవితని మెప్పిస్తే ఆ మెప్పించిన నేతకి తెరాస హై కమాండ్ నుండి భారీ బంపర్ ఆఫర్లు కూడా ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఈసారి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవితను ఎలాగైనా గెలిపించాలని డిసైడ్ అయిన తెరాస హై కమాండ్ మేదక్ లో ఆపరేషన్ ఆకర్ష్ ను అమలు చేసింది. కాగా అక్కడి తెరాస నేతలకు వారికి సాధ్యమైనంత సంఖ్యలో ప్రజలను వేరే పార్టీ లోని కార్యకర్తలను, నాయకులను, కార్పొరేటర్ లను, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను తెరాస పార్టీ లోకి తీసుకురమ్మని హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ నియోజకవర్గంలో ఒక్కసారిగా వలసలు మొదలయ్యాయి.. పార్టీ ఆఫీసుల వద్ద నాయకులు క్యూలు కట్టి మరీ పార్టీలోకి వస్తున్నారు. ఎవరైతే ఎక్కువ సంఖ్యలో వలసలను తీసుకువస్తారో వారికి హైకమాండ్ నుండి బంపర్ ఆఫర్లు అందుతాయి, పైగా కవిత దగ్గర వారికి కొంత చోరువ దక్కుతుంది.

 

పైగా మునుపు జరిగిన ఎంపీ ఎన్నికల్లో కవిత ఓటమి పాలయిన విషయం తెలిసిందే.. ఆ ఎన్నికల సమయంలో కొందరు ఎమ్మెల్యేలు పనిగట్టుకుని మరీ కవితను ఓటమిపాలు చేశారని ప్రచారం జరిగింది.. నిందపడి కుమిలిపోతున్న ఆ ఎమ్మెల్యేలకు, స్ధానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నిక రూపంలో తమ నిజాయితీ చాటుకునే అవకాశం వచ్చిందట. అందుకే ఎమ్మెల్యేలు పోటీ పడి బీజేపీ- కాంగ్రెస్ పార్టీల నుండి గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను గులాబీ గూటికి చేరుస్తున్నారు. దీంతో వలసలు అంబరాన్ని తాకుతున్న దుస్తుతి తలెత్తింది. ఇప్పటికే ఐదుగురు కార్పొరేటర్లు, 20 మంది ఎంపీటీసీ లు కౌన్స్లర్ లతో పాటు అనేక మంది తెరాస తీర్థం పుచ్చుకున్నారు.

 

ఇక ఈ విషయం ఇలా ఉంటే నిజామాబాద్ లో బీజేపీ క్యాడర్ ను దెబ్బ తీసేందుకు అక్కడి ఎంపీ ధర్మపురి అరవింద్ సోదరుడు ధర్మపురి సంజయ్ ను తెరాస తనవైపు నుండి రంగంలోకి దింపింది. ధర్మపురి సంజయ్ కు ఆ నియోజకవర్గ కార్పరేటర్ల ఎంపీటీసీ లతో మిత్రుత్వం ఉండటంతో మరి కొందరు కూడా పార్టీలోకి వచ్చే ఛాన్సులు పెరిగాయని తెలుస్తుంది. మొత్తానికి ఈ వ్యవహారాలు అన్నీ చూస్తుంటే ఆపరేషన్ ఆకర్ష్ లో తెరాస విజయాన్నే సాధించిందని అర్థమవుతుంది.. మరి పార్టీ ఆ ఆఫర్లు ఏ ఎమ్మెల్యే లకి ఇస్తుందో..? ఏ నాయకుడు కవిత మెప్పు పొందాడో.. కవిత అలక తీర్చిన ఆ నాయకుడు ఎవరో తెలియాలంటే మరి కొంత కాలం గడవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: