భారత్ ఛైనా సరిహద్దుల్లో కలవరం మొదలైంది.. లడఖ్ లో ఉద్రిక్త సెగలు ఎగిసిపడుతున్నాయి. మన సరిహద్దులోకి చొచ్చుకొచ్చేందుకు ఛైనా ఏ అవకాశాన్ని వృధా చేయడం లేదు. ఛైనా కవ్వింపు చర్యలు కోనసాగిస్తూనే ఉంది, ఇప్పటికే 20 మంది  భారత సైనికులను పొట్టనబెట్టుకుంది. ప్రధాని మోదీ విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రితో పాటు త్రివిధ దళాదీపతులతో ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించి త్రివిధ దళాలను సిద్ధంగా ఉండమని కోరారు. ప్రతి క్షణం ఉత్కంఠగానే సాగుతుంది. ఓ వైపు కరోన అల్లకల్లోలం చేస్తుంటే మరివైపు చైనా యుద్ధానికి మనల్ని కవ్విస్తుంది. ఇక ఆర్థిక రంగం రోజురోజుకూ క్షీణిస్తూనే ఉంది దీంతో 2020 ప్రధానికి ఎంతగానో కఠినంగా మారిపోతుంది. యుద్ధం అనే పరిస్తితి రాకుండా శాంతిని పునరుద్ధించేందుకు అధినేత దోహద పడుతున్నాడు. దేశాన్ని రక్షించే బాధ్యత కేవలం దేశ ప్రధానిదేనా..? త్రివిధ దళాలదేనా..? ఆ భాద్యత మనది కాదా..? మన కర్తవ్యం ఏంటి..? మనం తక్షణం చేయాల్సిన పనులెంటి..? మనం చేస్తున్న తప్పులేంటి..?

 

దేశ ప్రజలను దేశీయ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయమని ప్రధాని అభ్యర్ధిస్తున్నాడు, మన దేశంలో ఆర్థిక వ్యవస్థను గట్టిపరచడం మన భాద్యత కాదా... అని ప్రశ్నిస్తున్నాడు. మన దేశాన్ని ఆత్మ నిర్భర భారత్ గా తీర్చిదిద్దమని కోరుతున్నాడు.. కానీ మనం ఎంత వరకు పాటు పడుతున్నాం..? ఛైనా చేస్తున్న కవ్వింపు చర్యలకు మనం అందరం ఆద్యం పోస్తున్నాం.. చైనా చేస్తున్న అల్లర్లకు మనమే సహాయపడుతున్నాం. చైనా ఉత్పత్తులను ఛైనా అప్లికేషన్లను బాయ్ కాట్ చేయడం మన ప్రధాన కర్తవ్యం. ఛైనా ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా చైనా మొబైల్ అప్లికేషన్లు ఉపయోగించడం ద్వారా ఛైనా మార్కెట్ రోజురోజుకూ దూసుకుపోతుంది, మన కొనుగోళ్ల ద్వారా వారికి ప్రతి రోజు కోట్ల కొలదిలో లాభాలు వెల్లడవుతున్నాయి. మన జనాభా 135 కోట్లకు పై చిలుకు..  అందులో సుమారు 119 కోట్ల మంది ప్రజలు టిక్ టాక్ ను వాడుతున్నారు. ఇప్పటికే ఈ యాప్ ను 277కోట్ల సార్లు ఇన్స్టాల్ చేసి డిలీట్ చేశారు దాంతో ప్రపంచం లోనే టిక్ టాక్ కు భారత్ ఏ పెద్ద మార్కెట్ గా ఉద్భవించింది. ఇక మరో భారీ ఛైనా యాప్ పబ్ జి గేమ్ ప్లే స్టోర్ లెక్కల ప్రకారం పబ్ జి గేమ్ కు భారత్ ఏ రెండవ పెద్ద మార్కట్ అని తెలుస్తుంది. ఇక ఇలానే మరెన్నో ఛైనా యాప్ లను భారతీయ ప్రజలు పెంచి పోషిస్తున్నారు.

 

చైనీయులు తమ ఆర్మీ లోని అన్నీ ఆయుధాలను కేవలం ఈ రెండు యాప్ లతో వస్తున్న సంపద తో కొనుగోలు చేస్తున్నారు అని నిపుణులు చెబుతున్నారు. నిన్న జరిగిన మారణఖాండలో మన భారత సైనికులు 20 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. మనం వారికి ఇస్తున్న సంపదతో వారు ఆయుధాలు కొని మనపైనే దాడి చేస్తున్నారు ఇది ఎంత దారుణం..? ఎంతటి దౌర్భాగ్యం..! అమురులైన వారి చావులకు టిక్ టాక్, పబ్జీ వాడుతున్న ప్రతీ  ఒక్కరూ కారణమే. ఇప్పటికీ మించిపోయింది ఏమి లేదు ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి వారితో పోరాడుదాం.. ఛైనా వస్తువులను ఛైనా యాప్ లను డిలీట్ చేద్దాం. దేశ సరిహద్ధుల్లో సైనికులు మనకోసం ప్రాణాలు ఆర్పిస్తున్నారు.అక్కడ వారు అనుక్షణం పోరాటం చేస్తూనే ఉన్నారు, వారికి అండగా నిలబడదాం మనం కూడా మన ఇళ్లలోనే ఉంటూ వారితో పోరాడుదాం. సైనికులు ఆయుధాలతో పోరాడితే మనం వారికి సంపద లేకుండా చేసి వారి మార్కెట్ తో పోరాడుదాం. చైనా యఫ్ లను డిలీట్ చేద్దాం దేశానికి అండగా నిలుద్దాం...ఇదే మన కర్తవ్యం ఇదే మన భాద్యత..!

మరింత సమాచారం తెలుసుకోండి: