కరోనా ఎఫెక్ట్ ఉన్నా, లేకపోయినా మీడియా రంగం ఎప్పటి నుంచో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కుంటూ వస్తోంది. ముఖ్యంగా ప్రింట్ మీడియా కష్టాలు అన్నీ, ఇన్నీ కావు. నిర్వహణ ఖర్చులు పెరిగి పోవడం, పాఠకుల సంఖ్య, వ్యాపార ప్రకటనల సంఖ్య తగ్గిపోవడం, ఉద్యోగుల జీత భత్యాలు, న్యూస్ ప్రింట్ దిగుమతి చేసుకోవడం భారంగా మారడం, ఇలా ఎన్నో రకాల ఇబ్బందులను పత్రికలు ఎదుర్కుంటూ వస్తున్నాయి. దీంతోపాటు ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా నుంచి ఎదురవుతున్న పోటీని ఎప్పటికప్పుడు తట్టుకుంటూ, మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా, కొన్ని పత్రికలు తమకు ఉన్న పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా, నిర్వహణ భారమైన పత్రికలను నడిపిస్తూ వస్తున్నాయి. కొన్ని ఆర్థిక భారాన్ని భరించలేక పూర్తిగా మూత పడ్డాయి. దీంతో పత్రికల మనుగడపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. పత్రికలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న వారంతా భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారు. 

 

 

చాలా పత్రికల్లో సిబ్బందిని, నిర్వహణ ఖర్చులు తగ్గించే విషయంపై దృష్టి పెట్టాయి. ఈ మధ్య కాలంలో వెబ్ సైట్ ల హడావుడి ఎక్కువగా ఉండడం, ఏ వార్త అయినా క్షణాల్లో పాఠకులకు చేరిపోవడం వంటి పరిణామాలతో వాటికి కాస్త ఆదరణ పెరిగినట్టుగా కనిపిస్తోంది. డిజిటల్ మీడియా వేగంగా వ్యాప్తి చెందడం, వాటికి ఆదరణ ఎక్కువగా లభిస్తుండడంతో ది హిందూ వంటి పత్రికలు కూడా తీవ్ర ఆందోళనలో కనిపిస్తున్నాయి. కాకపోతే ఆ భయాన్ని ఎక్కడా బయట పడకుండా.. ఈ డిజిటల్ న్యూస్ హడావుడి కొంతకాలం మాత్రమే ఉంటుందని, పత్రికలకు ఎప్పుడూ ఆదరణ తగ్గదు అంటూ ఉద్యోగులను ఉద్దేశించి ఒక నోట్ ను ది హిందూ పత్రిక విడుదల చేసింది. అంతేకాదు ఇప్పటికే ది హిందూ పత్రిక ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంది. 

 

IHG

 

పేజ్ లేఅవుట్ డిజైనింగ్, మొదటి పేజీ ఆకట్టుకునే విధంగా రూపొందించడం, టాబ్లెట్ టైప్ సప్లిమెంట్లు, ఎక్కువ ఫీచర్లు అందించడం, ఇలా ఎన్నో మార్పులు తీసుకు వచ్చింది. అయినా ప్రస్తుత పరిస్థితులు కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తోంది. అగ్రశ్రేణి పత్రికలైన దైనిక్ జాగరణ్, దైనిక్ భాస్కర్ టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్ ఇలా అగ్రశ్రేణి పత్రికలు తీవ్ర సంక్షోభంలోకి జారిపోవడంతో పాటు, పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తూ పత్రిక నిర్వహణ ఖర్చులను తగ్గించుకుంటూ వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అటువంటి పీకి వేతల జోలికి వెళ్ళకుండా, పత్రికను మరింత ఆకర్షణీయంగా రూపొందించి, పాఠకులను ఆకట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చిన ది హిందూ పత్రిక కూడా ఇప్పుడు అందరి కంటే భిన్నం ఏమీ కాదని నిరూపించుకుంది. 

 

IHG


ఇప్పటి వరకు ది హిందూ లో వంద మంది వరకు ఉద్యోగులను తొలగించినట్లు గా తెలుస్తోంది. ఇప్పటి వరకు గంభీరంగా ఉంటూ తాము ఈ ఒడిదుడుకులు తట్టుకోగలము అంటూ వ్యవహరిస్తూ వచ్చిన ది హిందూ ఇప్పుడు మిగతా పత్రికలు బాటలోనే వెళ్తూ.. తామేమి ప్రత్యేకం కాదు అని నిరూపించుకుంది. మీడియా రంగంలో పనిచేస్తున్న వారు పరిస్థితులు చూస్తుంటే దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షు అన్నట్టుగా తయారైంది. ది హిందూ అయినా, ఈనాడు అయినా పత్రికలకు కష్టాలు కామన్ అనే విషయం ఇప్పుడు బయటపడుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: