వేలు పట్టుకుని నడక నేర్పించినా.. గాల్లోకి ఎగరేసి, పడకుండా పట్టుకున్నా..బిడ్డా అంటూ ముద్దు చేసినా..బంగారం అంటూ ఒళ్లో కూర్చోబెట్టుకుని కథలు చెప్పినా..త‌ప్పు చేసిన‌ప్పుడు దండించినా .. అమ్మకు తెలియకుండా ఐస్‌క్రీమ్ తినిపించినా.. అమ్మకు తెలియకుండా పాకెట్ మనీ ఇచ్చినా.. ధైర్యంగా బైక్ కీ ఇచ్చి నడుపు.. అంటూ వెనకాల కూర్చున్నా..ఇలాంటివన్నీచేసే ఒకే ఒక వ్యక్తి నాన్న. నడిచేడి దేవుడవు నీవే నడిపించే మార్గం నీదే , వెన్ను తట్టి నిలుస్తావు , అడుగుకు తొడవుతావు , నీవనే స్థయిర్యం నీవిచ్చే ధైర్యం వెలకట్టలేనిది , ఓర్పుకి సహనానికి నిదర్శనం . అమ్మ పరిచయం చేసే మొదటి వ్యక్తి నాన్న.. నాన్న తనకు తానూ ఎన్నో నేర్చుకుంటూ, పుట్టిన బిడ్డకూ నేర్పడం...నేర్చుకోవ‌డం చేస్తుంటాడు.


జీవితంలో ఎన్నో చేదు అనుభవాలను చూసి, ఎన్నో అవమానాలకు ఎదుర్కొని కష్టపడి తనకంటూ ఒక స్థాయి సంపాదిస్తాడు. పుట్టినప్పటి నుంచి మ‌న‌కు  కష్టం అంటే ఏంటో తెలియకుండా, అవమానాలేవి ఎదురవకుండా చూడాలని కలలు కంటాడు. నువ్వు ఎదుగుతుంటే నీ భవిష్యత్తును చూసుకుంటూ మురిసిపోతాడు. నీవు మొదటి సారి నాన్న అని పిలిచే సమయం కోసం ఎంత వేచి ఉంటాడో కదా ! ముసిముసి నవ్వులు నవ్వినప్పుడు, నడకనేర్చుకుంటున్న పుడు నాన్నకెంత ఆనందమో.. బుడిబుడి అడుగులతో బడికెళ్తుంటే నాన్న సంతోషం సాగరమై పొంగిపోదా. మన ప్రగతికి సోపానం మన జీవితానికి మార్గదర్శనం నాన్న ప్రతి విజయంలో నా వెంట ఉంటూ బాధలోనైనా నేనున్నాని ఆసరా ఇచ్చే వ్యక్తి నాన్న నీ గెలుపే తన లక్ష్యంగా నీ జీవితాన్ని నిలబెట్టేందుకు నిత్యం శ్రమించే శ్రామికుడు నాన్న అంటే బంధం ఇచ్చేవాడు కాదు ? భాద్యత తీసుకునే వాడు ! ... 


మ‌న‌ల్ని అల్లారు ముద్దుగా  చూసుకున్న నాన్న‌కు కాసింత ప్రేమ‌ను పంచుదాం..నువ్వు బుడిబుడి త‌ప్ప‌ట‌డుగులు వేసుకుంటూ న‌డుస్తూ ప‌డిపోకుండా వేలు ప‌ట్టి న‌డిపించిన నాన్న‌కు అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఆస‌రాగా నిల‌బ‌డ‌దాం. మ‌న భ‌విష్య‌త్ కోసం నిత్యం త‌పించిన నాన్న కోసం తోడుగా ఉందాం. అత‌ను చెప్పే బుద్ధి మాట‌లు కొన్నైనా ఆచ‌రించి చూపుదాం. నీ క‌ల‌లే త‌న ఆశ‌యాలుగా చెమ‌ట్చోడి క‌ష్ట‌ప‌డిన నాన్న‌ను గౌర‌విద్దాం..ప్రేమిద్దా...నాన్న‌కు పంచ ప్రాణాలైన మ‌నం...నాన్న ప్రేమిస్తే పోయేదేమీ లేదు....మ‌హా అయితే మ‌న‌కంటే వంద రెట్లు మ‌న‌పై ప్రేమ చూపుతాడు. నాన్న‌ను గౌర‌వించే...ప్రేమించే ప్ర‌తీ ఒక్క‌రికి ఫాద‌ర్స్ డే శుభాకాంక్ష‌లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: