అవాకాశాలు అనేవి అరుదుగా వస్తుంటాయి. అవకాశం వచ్చినప్పుడే దానిని సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు కొంతమంది అయితే, అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ రావు, మనమే అవకాశాలు సృష్టించుకోవాలనుకునే వారు ఇంకొందరు. అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. తాము ఒక్కరిమే ఎదిగితే కిక్కు ఏమి ఉంటుంది ..? మనతో పాటు ఎంతోమంది ఎదిగేందుకు అవకాశం ఇస్తూ చేయూతను అందించాలనే తపన ఉండే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైన, మంచి మనసున్న మనుషుల గురించి చెప్పుకుంటే మనకి కూడా గర్వంగానే ఉంటుంది.

IHG


శూన్యం నుంచి కూడా అవకాశాలు సృష్టించుకుని ఎదిగిన అటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ '' కోటి రెడ్డి సరిపల్లి ''. చదివింది పదో తరగతి... చేసింది మైక్రో సాఫ్ట్ లో ఉద్యోగం. అసలు పదో తరగతి చదివితే మైక్రో సాఫ్ట్ లో కీలక స్థానానికి ఎదగవచ్చా ? ఎలా ఎదగవచ్చు అనే దానికి ఉదాహరణగా 'కోటి రెడ్డి' జీవితాన్ని ఇప్పుడున్న జనరేషన్ స్ఫూర్తిగా తీసుకోవచ్చు. కోటి గ్రూప్స్ పేరుతో ఎన్నో కంపెనీ లను సృష్టించి వేలాది మందికి ఉపాధి కల్పించి... జీతాలే కాదు జీవితాలను ప్రసాదించిన, ప్రసాదిస్తున్న ఈ 'కోటి రెడ్డి ' గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ! కృష్ణ జిల్లా, గుడివాడ తాలూకా జనార్ధనపురం అనే పల్లెటూరిలో జన్మించిన 'కోటి రెడ్డి' జీవితం వడ్డించిన విస్తరేమీ కాదు.

IHG


ఒక సాధారణ  దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించడంతో ఈ స్థాయికి వచ్చేందుకు చాలానే కష్టపడ్డారు. కడుపు నిండా తినడమే కష్టం అనుకుంటే... పై చదువులు చదవడం అంటే అది అత్యాశే. సాధారణ రైతు కుటుంబం కావడంతో పై పదో తరగతి వరకు సొంత గ్రామంలోనే చదివారు. ఆ తరువాత పై చదువులు చదివేందుకు అవకాశం లేకుండా పోయింది. దానికి కారణం ఆర్ధిక సమస్యలు. చేసేది లేక వ్యవసాయం చేయడమే తప్ప మరో మార్గం లేదు అని పొలం బాట పట్టారు. అయినా జీవితం లో ఏదో సాధించాలనే తపన కోటి రెడ్డి ని ఊరికే ఉండనీయలేదు. 

IHG


జీవితంలో పైకి ఎదగాలంటే అవకాశాలు మన వద్దకు రావు.. మనమే అవకాశాలు సృష్టించుకోవాలనే అభిప్రాయంతో కోటి తీసుకున్న నిర్ణయం ఆయన జీవితాన్నే మార్చేసింది. పండక్కి బట్టలు కొనుక్కోమని ఇచ్చిన డబ్బులతో కంప్యూటర్ కోర్స్ చేసి ఆ తరువాత కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ చేశారు. ఆ తరువాత తాను కంప్యూటర్ కోర్స్ చేసిన సంస్థనే లీజుకు తీసుకుని నడిపించినా సంతృప్తి కలగలేదు. ఇక ఇక్కడ ఉంటే లాభం లేదు అని ఏడు వందల రూపాయలతో హైదరాబాద్ లో అడుగుపెట్టారు. అక్కడ మరొకొన్ని కంప్యూటర్ కోర్స్ లు చేసి, ఆ రంగంపై పూర్తిగా పట్టు సాధించారు. ఇక ఆ తరువాత మైక్రోసాఫ్ట్ ఇంటర్వ్యూ కి వెళ్లి అందరికంటే మెరిట్ సాధించారు.

 

IHG


 కానీ చదివింది పదో తరగతి అని తెలుసుకుని ఆ సంస్థ ప్రతినిధులే ఆశ్చర్యపోయారు. అయినా కోటి రెడ్డి టాలెంట్ ముందు చదువు లెక్క కాదు అని ఆయనకు మైక్రో సాఫ్ట్ లో ఉద్యోగం ఇచ్చారు. ఈ విధంగా పదో తరగతి అర్హతతో మైక్రో సాఫ్ట్ లో ఉద్యోగం సంపాదించిన తొలి భారతీయుడిగా కోటి రెడ్డి సరికొత్త రికార్డ్ సృటించారు. ఇక అక్కడి నుంచి ఎన్నో ఎన్నెన్నో విజయాలు సొంతం చేసుకున్నారు. దేశ విదేశాల్లో ఎన్నో కంపెనీలు స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు.

IHG

 

 ఒక ఉద్యోగికి జీతం ఇచ్చి సరిపెట్టడమే కాకుండా, అతడి సంక్షేమం, కుటుంబాన్ని గురించి కూడా ఆలోచించే మహోన్నతమైన గొప్ప మనిషిగా డాక్టర్ కోటి రెడ్డి తన గొప్పతనాన్ని చాటుకుంటున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఒకే ఒక్క లక్షణం ఈ కోటి రెడ్డి ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇంత ఘన కీర్తిని తెచ్చిపెట్టింది. ఈ కోటి రెడ్డి గురించి రాయడానికి పేజీలు చాలవు ... పుస్తకాలు పట్టవు. 

మరింత సమాచారం తెలుసుకోండి: