కేంద్ర ప్రభుత్వం ప్రతీ వాహనదారు నుండి పెట్రోల్ డీజిల్ పై ఎంత ట్యాక్స్ వసూలు చేస్తుందో తెలిస్తే నోరెళ్ళబెడతారు. ఇప్పటికే కరోనా విలయతాండవానికి ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది, ప్రజలకు ఆదాయం లేక వారికి డబ్బు సరిపోవడం లేదు, పైగా కేంద్రం ప్రతీ రోజు చమురు పై ధరలు పెంచుతూనే ఉంది, దీంతో వాహనదారులు పట్టపగే చుక్కలు చూస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీని పరిగణలోకి తీసుకుంటే లాక్ డౌన్ కు ముందు పెట్రోల్ ధర 71.26 రూపాయలు. ఇక 71.26 రూపాయల్లో అనేక పన్నులు ఉంటాయి అందులో ఎక్సైస్ పన్ను 33 రూపాయలకు చేరువలో ఉంటుంది  వ్యాట్  ఛార్జీలు (VAT) దాదాపుగా 17 రూపాయలు ఉంటుంది, రెండు పన్నులు కలిపితే దాదాపుగా 50 రూపాయలు..! అసలు పెట్రోల్ యొక్క బేస్ ప్రైస్ కేవలం 21 రూపాయలు మాత్రమే.

 

అంటే ప్రభుత్వం ప్రతి ఒక్క వాహనదారు నుండి సగటున ఒక్క లీటరు కు 50 రూపాయలు కేవలం టాక్స్ పైనే వసూల్ చేస్తుంది. మనకు లీటరు పెట్రోల్ 21 వసూలు చేసుకోగా దానికి దాదాపుగా రెండున్నర ఇంతలు ట్యాక్స్ విధిస్తుంది. ఇక డీజిల్ విషయానికొస్తే 45 రూపాయల ట్యాక్స్ వసూల్ చేస్తుంది. ఇంత ట్యాక్స్ ను ఏ దేశం కూడా విధించదు ఆగ్రా రాజ్యం అయిన అమెరికా నే కేవలం 19 పెర్సెంట్ ట్యాక్స్ ను విధిస్తుంటే భారత్ మాత్రం వాహనదారులను పీల్చి పిప్పి చేస్తుంది.

 

ఇక ఇప్పుడు లాక్ డౌన్ తరువాత గత 21 రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరల పై రోజుకు ఇంత చొప్పున ధర పెరుగుతూనే ఉంది. లాక్ డౌన్ కు ముందు 71.26 గా ఉన్న పెట్రోల్ ఇప్పుడు 80.33 రూపాయలకు చేరింది అంటే 9 రూపాయలు పెరిగింది కేవలం 21 రోజుల వ్యవది లో 9 రూపాయలు పెరగడం చరిత్ర లోనే ఇది తొలిసారి. గతం లో మనం కడుతున్న 50 రూపాయల ట్యాక్స్ పై ఇది ఆధనంగా మనం కడుతున్నాము అంటే దాదాపుగా 59 నుండి 60 రూపాయలు. కేంద్రం చమురు ధరలను గత 21 రోజులుగా పెంచుతూనే ఉంది. కేవలం ఈ 21 రోజులను మనం పరిగణలోకి తీసుకొని లెక్కలు వేస్తే..

 

భారత్ జనాభా దాదాపుగా 135 కోట్లకు పై చిలుకు అందులో సగం జనాబా వద్ద వాహనాలు ఉంటాయి ప్రతీ ఒక్క వాహనదారు సగటున రోజుకు కేవలం ఒక్క లీటరు పెట్రోల్ కొట్టించినా 65 కోట్ల లీటర్ల పెట్రోల్ ఖర్చు అవుతుంది. ఈ 65 కోట్ల లీటర్లకు ఒక్కో లీటరుకు 60 రూపాయలు ట్యాక్స్ మనం కడితే అది దాదాపుగా 3900 కోట్లు. ఇక డీజిల్ విషయానికొస్తే ఆవి దాదాపుగా 3100 కోట్లు రెండు కలిపితే కేంద్రం కేవలం గత 21 రోజుల్లో 7000 వేల కోట్లు కేవలం పెట్రోల్ డీజిల్ పై వసూలు చేసింది. ఇది చాలా సుసాధారణమైన లెక్క మాత్రమే ఈ విషయం పై పూర్తి అవగాహన ఉన్న నిపుణులు లెక్కలు వేస్తే 10 వేల కోట్లకు పైగానే కేంద్రం గత 21 రోజుల్లో కవర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: