హ్యాకింగ్... అంటే ఎవరో అమానుషమైన వ్యక్తి మనకు తెలియకుండానే మన వ్యక్తిగత సమాచారాన్ని దోచేయడం అది కూడా మన సహాయం తోటే..! వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా కానీ ఇదే నిజం. మనకు తెలియకుండానే మనం హ్యాకింగ్ భారీన పడతాము, మన వ్యక్తిగత సమాచారం ఇంటర్నెట్ లో ఎక్కడా లీక్ అవ్వకుండా ఉండేందుకు మనం కేవలం పాస్ వర్డ్ లను పెట్టుకుంటాం అదే ప్రభుత్వం అయితే ఏం చేస్తుంది..?

 

ప్రభుత్వం తన అఫీషియల్ వెబ్ సైట్ లలో ఉండే సమాచారాన్ని ఎవ్వరికీ తెలియనివ్వకుండా ఎవ్వరూ ఎంత కృషి చేసినా హ్యాకింగ్ కు గురవ్వకుండా ఓ ఫైర్ వాల్ ను నిర్మించాలి. మనం ఉపయోగించేది పాస్ వర్డ్ మాత్రమే  ప్రభుత్వాలు సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉపయోగించేవి ఫైర్ వాల్స్. కానీ ప్రభుత్వ ఫైర్ వాల్స్ కే దిక్కు లేదు ఇక మన పాస్ వర్డ్ లు ఎంత అంటున్నారు నిపుణులు ఎందుకంటే అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. 

 

మన ప్రభుత్వపు వెబ్ సైట్లు సురక్షితంగానే ఉన్నాయా...? ప్రభుత్వం మన వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వపు అంతర్గత సమాచారాన్ని సురక్షితంగానే ఉంచుతుందా అంటే లేదు అనే జవాబు వినిపిస్తుంది. మనం ప్రభుత్వాన్ని ఎంతగానో నమ్మి మన వ్యక్తిగత సమాచారాన్ని ఇస్తూ ఉంటాము కానీ ఈ మధ్య చూస్తుంటే ప్రభుత్వం మన సమాచారాన్ని సురక్షితంగా ఉంచలేకపోతుందని తెలుస్తుంది. కేవలం గత 12 సమయం లో భారత ప్రభుత్వం ఉపయోగించే రెండు వెబ్ సైట్ లు హ్యాక్ అయ్యాయి. దాదాపుగా లక్షల మంది సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే.. జమ్ము కాశ్మీర్ లోని ప్రభుత్వం కరెంటు వెబ్ సైట్ ను హ్యాకర్లు హ్యాక్ చేశారు నిమిషాల వ్యవది లో అవసరమైన సమాచారాన్ని అంతా దోచేశారు. ఆ వెబ్ సైట్ కు 101 సర్వర్లు ఉండగా 4 సర్వర్లను పూర్తిగా హ్యాక్ చేసేశారు మరో 24 సర్వర్లను వారి ఆదీనంలోకి తీసుకున్నారు.

 

ఇక రెండవ ఘటన విషయానికొస్తే.. దేశ రాజధాని ఢిల్లీ కరోనా పరిస్థితులను పర్యవేక్షించి రిపోర్ట్ ఇచ్చే వెబ్ సైట్ ను హ్యాకర్లు హ్యాక్ చేసేశారు. వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన అనంతరం మొత్తం 80,000 మందికి పైగా కరోనా పేషంట్ల వివరాలను వ్యక్తిగత సమాచారాన్ని దోచేశారు. వారి ఆధార్ కార్డ్ బ్యాంక్ డీటెయిల్స్ తో సహా వారి వ్యక్తిగత సమాచారం అంతా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ హ్యాకింగ్ కు పాల్పడ్డ ముఠా కేరళ రాష్ట్రానికి చెందిన కేరళ సైబర్ హ్యాకర్స్ గ్రూప్. వారు ఈ హ్యాక్ చేయడానికి గల కారణాన్ని కూడా తెలిపారు.

 

 మన ప్రభుత్వం వాడుతున్న సున్నిత ఫైర్ వాల్స్ ఎందుకు పనికిరానివాని వారికి హ్యాక్ చేయడానికి కేవలం 10 నిమిషాలు మాత్రమే పట్టిందని తెలియజేశారు. ఇలాంటి వెబ్ సైట్లు వాడటం వల్ల వ్యక్తుల వ్యక్తిగత సమాచారనికే ముప్పు ఉందని వారు తెలియజేశారు, చివరికి ఆ డేటా ను మరలా తిరిగి అధికారులకు అప్పజెప్పారు. ఈ ఘటనలు వింటుంటేనే భయంగా ఉంది కదూ..! ఇది మన ప్రభుత్వాల పరిస్థితి మన వ్యక్తిగత సమాచారానికి కూడా ఓ రక్షణ లేదు. ప్రభుత్వాలు ఇటువంటి విషయాలపై మరింత అవగాహన చేసి మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కురుదాం..! ఇది ఇలా ఉంటే కోవిడ్ పేరును చెప్పి ఫ్రీ గా పరీక్షలు చేస్తామని ఫ్రీ గా చికిత్స చేస్తామని మెయిల్స్ వస్తాయట అది కూడా భారత ప్రభుత్వం నుండి వచ్చే మెయిల్స్ రూపంలో పొరపాటున ఆ మెయిల్స్ ఓపెన్ చేశారో ఇక అంతే సంగతులు అందరూ జాగ్రత్తగా ఉండండి సుమా...!

మరింత సమాచారం తెలుసుకోండి: