చైనా పెద్దన్న అయితే పాకిస్థాన్ తమ్ముడు, ఇక ఈ మధ్య నేపాల్ కూడా ఈ జాబితాలో కలిసిపోయింది దాంతో నేపాల్ చైనా కు చిన్న తమ్ముడు అయ్యింది. ఈ ముగ్గురి దుష్టత్రయాన్ని ఎదుర్కోవడమే ఇప్పుడు భారత్ కు పెద్ద సవాల్. గత సంవత్సరం భారత్, పాక్ ల మధ్య సంభవించిన గొడవలు తెలిసినవే.. పుల్వమా దాడి ఆపై సర్జికల్ స్ట్రైక్ దాంతో ప్రపంచవ్యాప్తంగా ఆ అంశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. వెంటనే పీఓకే గొడవలు కాశ్మీర్ ప్రక్షాళన ఇక అప్పటినుండి పాక్ కు భారత్ పై ఉన్న పగ మరింతగా పెరిగిపోయింది.

 

పాక్, భారత్ పై ప్రపంచ సభల్లో నిప్పులు కక్కడం అందుకు చైనా పాక్ పై సానుభూతి చూపడం ఇలాంటి ఘటనలు అనేకం సంభవించాయి. ఇక మరో పక్క చైనా భారత్ ల గొడవలు ఈనాటివి కావు దాదాపుగా 1960 నాటి నుండి ఇంకా చెప్పాలంటే తెల్ల దొరలు మాక్ మొహం లైన్ ను గీసి భారత్ చైనాల సరిహద్దులు నిర్ణయించిన నాటినుండి ఇరు దేశాల మధ్య అనేక గొడవలు నిరసనలు అభిప్రాయాలూ ఉదృత పరిస్థితులు. ఇక ఈ సంవత్సరం భారత్ చైనాకు వ్యతిరేకంగా తన గలాన్ని వాంగ్మూలాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి ఇక మరోసారి సరిహద్దు అంశాన్ని తెరపైకి తెస్తు చైనా చేస్తున్న హంగామా తెలిసిందే.

 

మన సరిహద్దుల్లోకి చొచ్చుకు రావడం ఇరు దేశాల మధ్య ఉన్న నిబంధనలు ఉల్లంఘించడం మన సైనికులను హతమార్చడం ఇలా మరెన్నో. ఇక ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం చివరిలో ఉండే నేపాల్, మన దేశం లోని ఓ రాష్ట్రం అంత ఉండే నేపాల్ భారత్ పైనే కుట్రలకు అరికడుతుంది. చైనాతో సంబంధాలు పెంచుకుంటూ చైనీయుల మద్దత్తు ఉంటే ఏమైనా చేయగలమనే ధీమాతో భారత్ పైనే దుస్సాహాస చర్యలకు పాల్పడుతుంది. భారత్ నేపాల్ కు చేసిన మేలును మరచి వ్యవహరిస్తుంది. భారత్ కు కష్టకాలం అని భావించి ఇలాంటి సమయం లోనే భారత్ ను దెబ్బ కొట్టాలని భావిస్తుంది.

 

భారత్ కు విరుద్ధంగా ఉండే గేయాలను తమ రేడియోల్లో వినిపిస్తుంది, తమ దేశ ప్రజలకు భారత్ ను ఓ ఉన్మాద దేశంగా చిత్రీకరిస్తుంది. భారత్ పై విరుద్ధంగా నినాదాలు చేస్తుంది, తమ దేశ ప్రజలతో చేయిస్తుంది. తాజాగా ఎంత పెద్ద తప్పిదానికి ఒడిగట్టారంటే భారత్ లోని కొన్ని ప్రాంతాలను ఉదాహరణకు లీపులేక్, కాలాపానీ నది, లింపీ అదురా వంటి మన భూభాగంలోని ప్రాంతాలను తమ ఆధీనంలోకి కలుపుకుంటూ మ్యాప్ ను విడుదల చేసింది. చైనాతో కలిసి భారత్ పైనే కుట్రలకు పాల్పడుతుంది.

 

ఇక పాకిస్థాన్ తాజాగా జరిగిన కరాచీ దాడులను ఉద్దేశిస్తూ ఆ దాడుల వెనుక భారత్ హస్తం ఉందని తనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందని ఆరోపణలు చేస్తుంది. భారత్ ను ప్రపంచ దేశాలకు ఉన్మాద దేశంగా చిత్రీకరించేందుకు ఇటువంటి ఆరోపణలకు పాల్పడుతుంది. భారత్ పొరుగు దేశాలే ఇవి, భారత్ ఈ దేశాలతో సరిహద్దులు పంచుకుంది. సరిహద్దుల నుండి దాడి చేసే ప్రయత్నంలో చైనా నిమగ్నయ్యుంది. మూడు పక్కల నుండి భారత్ ను నిర్వీర్యం చేసి భారత్ పై తమ జులుంను చెలాయించేందుకు పన్నాగం పన్నింది.

 

కాని చైనా కు తెలియనిది ఏంటంటే  భారత్ ఓ అద్భుతమైన దేశం.. ఎన్నో దేశాలకు మిత్రదేశం. ఎన్నో దేశాలకు ఎందరో ప్రధానులకు భారత్ అన్నా భారత ప్రధాని అన్నా స్పూర్తి. ఈ క్రమంలో ప్రపంచ పెద్దన్న అమెరికా భారత్ కు అండగా నిలిచేందుకు తమ సైన్యాన్ని పంపుతుంది. ఎమర్జెన్సీ సమయం వస్తే ఇజ్రాయిల్ మన సైన్యానికి అండ నిలుస్తుంది. ఇక ప్రపంచానికే మరో బాస్ రష్యా..! రష్యా సైతం భారత్ కు తోడు నిలవాలని నిశ్చయించుకుంది. ఇలా మరెన్నో దేశాలు కేవలం ఒక్క పిలుపుతో మన తోడు నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. చైనా త్రిశూల వ్యూహాలు, దుష్టత్రయాలు పన్నితే భారత్ అష్ట దిగ్భంధన వేయగలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: