ఏపీ లో మరోసారి ఓ నీచమైన పనికి పాల్పడ్డారు అధికారులు. కరోనా వచ్చిన రోగులను సురక్షిత కావాచాలు ధరించి మరీ అంటరానివారుగా చూస్తూ వారు చనిపోయిన తరువాతా కూడా వారి మృతదేహాలకు కనీస ధర్మం విలువ చూపకుండా జేసీబీలు ట్రాక్టర్లు ఉపయోగిస్తూ అంత్యక్రియలు చేస్తున్నారు. తాజాగా తిరుపతిలో ఓ వ్యక్తి కరోనా వ్యాధితో బాధపడి మరణించగా ఆయన మృతదేహానికి కనీస విలువ చూపకుండా జేసీబీ ని ఉపయోగించి పూర్చిపెట్టారు జీహెచ్‌ఎం‌సీ అధికారులు. ఈ ఘటనను చూపుతూ ఘటన జరిగిన తీరును వివరిస్తూ ఉన్న వీడియోను ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారా లోకేశ్ తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ ఘటన తనను ఎంతగానో కలచి వేసిందంటూ ప్రభుత్వం తీరును తప్పుబడుతూ భావోద్వేగమైన సందేశాన్ని రాస్తూ పోస్ట్ చేశారు.

 

కరోనాతో మరణించిన ఓ వ్యక్తిని దాదాపుగా 6 మంది సిబ్బందితో ఉన్న అంబులెన్స్ తీసుకొచ్చింది. ఆ అంబులెన్స్ పై తిరుమల  తిరుపతి దేవస్థానం అని ముద్రించి ఉంది. ఆపై ఆ అంబులెన్స్ వద్దకు ఓ జేసీబీ చేరుకుంది ఆ జేసీబీ లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వారు కూడా పూర్తిగా పీపీఈ కిట్లతో సురక్షితమైన దుస్తులు ధరించి ఉన్నారు. అంబులెన్స్ లో ఉన్న మృతదేహాన్ని జేసీబీ సాయంతో పైకి తీశారు. జేసీబీ లో ఉన్న డ్రైవర్ కూడా సురక్షిత దుస్తులు ధరించి ఉన్నాడు. అంటే మొత్తం 9 మంది జీహెచ్‌ఎం‌సీ సిబ్బంది పూర్తిగా పీపీఈ కిట్లతో సురక్షిత కవచపు దుస్తులతో దరించి ఉన్నారు. అందరూ కలిసి ఆ మృతదేహాన్ని అక్కడ తవ్విన ఓ గోతిలో జేసీబీ సాయంతో పూడ్చి పెట్టారు. అయితే అక్కడకు చేరుకున్న స్థానికులు ఈ వీడియోను రికార్డ్ చేశారు. ఆ వీడియోను కాస్త నారా లోకేశ్ తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఇక ఆ వీడియో వైరల్ అవడంతో దానికి వెంటనే స్పందించారు జీహెచ్‌ఎం‌సీ అధికారులు..

 

చనిపోయిన వ్యక్తి ఒబేసిటీ ఉన్న వృద్ధుడని, పైగా తన బరువు దాదాపుగా 170 -180 కిలోల వరకు ఉంటుందని అంత బరువును సిబ్బంది లేపలేకపోయారని జీహెచ్‌ఎం‌సీ మునిసిపల్ కమిషనర్ పీఎస్ గిరీష్ తెలిపారు. వాళ్ళు లేపలేకపోయినందునే బాగా శిక్షణ పొందిన జేసీబీ డ్రైవర్ సహాయంతో ఆ పని చేయించామని అందుకు నాలుగురి సహాయం తీసుకున్నామని ఆయన అన్నారు. ఈ ఘటన జరగకముందే తమ కుటుంబ సభ్యుల సమ్మతి తీసుకొనే ఈ పని చేశారని వారిని అడిగే జేసీబీ ను ఉపయోగించామని ఆయన స్పందించారు. మొత్తానికి ఎలాగో అలా ఈ ఘటనలో తమ తప్పిదం ఏమి లేనట్టుగా వారు స్పందించారు. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుంటే చనిపోయిన వ్యక్తి ఒబేసిటీతో బాధ పడుతున్నా కూడా ఆయన 170 నుండి 180 కిలోల బరువు ఉండడు, ఇక రెండవ విషయం కమిషనర్ గిరీష్ నలుగురి సహాయం తీసుకున్నామని అన్నారు కానీ అక్కడ మొత్తం 9 మంది సిబ్బంది ఉన్నారు.

 

కమిషనర్ చెప్పినట్టే అక్కడ ఒకవేళ నాలుగురే ఉంటే లేపడానికి కష్టం అని మనం అనుకోవచ్చు, కానీ అక్కడ 9 మంది ఉండి కూడా లేపలేకపోయారంటే అది కచ్చితంగా అతిశయోక్తే...! కరోనా వ్యాధి కచ్చితంగా అంటు వ్యాధే, కానీ సిబ్బంది రక్షణ దుస్తులు వేసుకున్నారు కదా..? అలా వేసుకొని కూడా ఇలాంటి నీచానికి ఎలా పాల్పడ్డారు..? తమ కుటుంబాల్లో ఎవరికైనా ఇలాంటి జబ్బే వస్తే ఇలాగే చేస్తారా..? ఏపీ ప్రభుత్వం 10 లక్షల టెస్టులు చేస్తే సరిపోదు మానవతా విలువలు కూడా కాపాడాలి అని భావిస్తున్నారు విశ్లేషకులు. ఇలా జరగడం ఏపీ లో ఇది రెండవ సారి, ఇకనైనా ప్రభుత్వ దొరణి మారుతుందేమోనని ఆశిద్దాం...!

మరింత సమాచారం తెలుసుకోండి: