తొలి మూడు సీజన్ లతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఉర్రూతలూగించిన రియాలిటీ షో 'బిగ్ బాస్' నాలుగవ సీజన్ కు ముస్తాబవుతోంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ రియాల్టీ షో పై ప్రేక్షకులు చాలా అంచనాలను పెట్టుకున్నారు. మొదటి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా అదరగొట్టేయగా రెండో సీజన్ లో న్యాచురల్ స్టార్ నాని మంచి మార్కులు కొట్టేశాడు. ఇక మూడవ సీజన్ హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున దీన్ని విజయవంతం చేశారు. ఇకపోతే ఇప్పుడు బిగ్ బాస్ సీజ‌న్ 4 సంగ‌తేమిటి.?  హోస్ట్ ఎవ‌రు.?  పార్టిసిపెంట్స్ ఎవ‌రెవ‌రు..? లాంటి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి.

 

కరోనా నేపథ్యంలో ఈసారి భారీ మార్పులు చేసినట్టు తెలుస్తోంది. గత సీజన్‌ లలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో కలుపుకుని 18 మంది కంటెస్టెంట్ల ఉండగా.. ఈ సీజన్‌ కి కేవలం 12-15 మంది కంటెస్టెంట్లు మాత్రమే ఉంటారని.. షో కూడా 50 రోజులకు కుదించినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే ఇప్పటికే బయటకు వచ్చిన సమాచారం ప్రకారం మొదట అక్కినేని కోడలు సమంతను నాలుగో సీజన్ హోస్ట్ గా తీసుకోవాలని భావించిన నిర్వాహకులు.. ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ను నాలుగో సీజన్ హోస్ట్ గా తీసుకొనున్నారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 

ఈసారి హౌస్ లో మరింత మసాలా ఉండబోతుందని సమాచారం. ఇందుకోసం రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘నగ్నం’ చిత్రంలోని హీరోయిన్ శ్రీ రాపాక హౌస్ లోకి తీసుకోబోతునట్టు తెలుస్తుంది. వాస్తవానికి కాంట్రవర్సీ అయినా, ఫేమస్ పర్సన్ అయినా, బోల్డ్ బ్యూటీ అయినా.. ఇలా ఏదో ఒక పాయింట్‌ లో జనాలను అట్రాక్ట్ చేసిన వ్యక్తులే బిగ్ బాస్‌లో కనిపిస్తుంటారు. ఇది గమనించిన శ్రీ రాపాక.. తాను ఇచ్చే ఇంటర్వ్యూలలో సంచలన వ్యాఖ్యలు చేయడం, కుండబద్దలు కొట్టిన చెప్పడం, బోల్డ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టింది. ఇలా చేయడం ద్వారా బిగ్ బాస్ మేనేజ్‌మెంట్ దృష్టి ఇప్పుడు ఆమెపై పడిందని తెలుస్తుంది. పైగా వర్మ ‘నగ్నం’ చిత్రంలో ఆమె అందాలకు కుర్రకారు  ఫిదా అయిపోయారు.  మరి బిగ్ హౌస్ లో ఈ భామ ఎలా మెరుస్తుందో.. ప్రజలని ఎలా ఆకర్షిస్తుందో అనేది తెలియాలంటే ఎదురుచూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: