ఒకపక్క తెలంగాణ ప్రజలంతా కరోనా మహమ్మారి దెబ్బకి విలవిలలాడిపోతుంటే.. మరోపక్క అధికార, ప్రతిపక్ష నేతలు మాత్రం బాధ్యత లేకుండా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కరోనాని కట్టడి చేయటంలో అధికారపక్షం విఫలమైతే.. దాన్ని రాజకీయంగా వాడుకుంటూ ప్రతిపక్ష నేతలు సక్సెస్ అవ్వాలని చూస్తున్నారు. ఇందుకు నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. తెలంగాణ ప్రజానీకం కరోనా మహమ్మారి దెబ్బకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది.. అయితే తాజాగా ఈ విషయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందిస్తూ.. తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యంగా మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

 

టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుకి ఊడిగం చేసిన తలసాని.. ఇప్పుడు అదే చంద్రబాబుని హైదరాబాద్ కి వస్తే ఉరికించి కొడతా అనడం హాస్యాస్పదం అని.. ఇప్పుడు సీఎం కేసీఆర్ మెప్పు కోసం ప్రతిపక్ష నేతలపై నోరు పడేసుకుంటున్నారని.. ఇది సరైన పద్దతి కాదని, తలసాని ఇకనైనా తన గుండాగిరిని మానుకోవాలని, లేదంటే తాము కూడా అదే పద్దతిలో సమాధానం చెప్పాల్సి ఉంటుందని జగ్గారెడ్డి హెచ్చరించారు. తలసాని తనని గెలిపించిన ప్రజలకోసం కాకుండా కేసీఆర్ కుటుంబం కోసం, ఆయన కుటుంబం కోసం పని చేస్తున్నారు. ప్రజలకోసం చేయాలనుకుంటే గాంధీ హాస్పిటల్ కి కేసీఆర్ తో మాట్లాడి 3 వేల కోట్లు ఇప్పించి తన మొగతనం నిరూపించుకోవాలని జగ్గారెడ్డి అన్నారు.

 

అలాగే కరోనా ని ఆరోగ్య శ్రీ లో చేర్పించి మొగతనం నిరూపించుకో..కరోనా వైద్యం కోసం ఆరోగ్య శ్రీ లో 10 వేల కోట్లు వేయించి నువ్వెంటో నిరూపించుకో అని సవాల్ విసిరారు. కరోనా ని ఆరోగ్య శ్రీ లో చేరుస్తున్నట్లు త్వరలోనే జీవో రావాలి లేదంటే శనివారం రూల్స్ పాటిస్తూ ఒక రోజు దీక్ష చేస్తా. దీక్ష చేసిన స్పందించకపోతే హైద్రాబాద్ కేంద్రంగా రోజు ఒక కార్యక్రమం చేస్తా… కేసీఆర్ కొత్త సచివాలయం కేవలం తన నిషాని కోసం కట్టిస్తున్నాడు. ప్రజల డబ్బు 500 కోట్లు వృధా చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలకోసం ఆలోచించి ఆరోగ్య శ్రీ లో కారోనో ని చేరుస్తున్నట్లు ఆరోగ్య శ్రీ కి 10 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు జీవో ఇవ్వాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

 

అయితే జగ్గారెడ్డి వ్యాఖ్యలు చూసిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు నవ్వుకోవడం మొదలుపెట్టారు. ఏదో ప్రతిపక్షంలో ఉన్నాం, ఏదోకటి మాట్లాడాలి కాబట్టి ఆయన మాట్లాడారని భావిస్తున్నారు. అలాగే ఈయనతో పాటు మాటలు కలిపి కొంతమంది తలసానిని నిలదీస్తున్నారు. ఏది ఏమైనా.. ఈ కరోనా వల్ల అధికార పక్షానికి తలనొప్పి వస్తుంటే.. దీన్ని రాజకీయంగా మార్చుకుని ప్రతిపక్ష నాయకులు అధికార పక్షానికి మరింత తలనొప్పిగా మారారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: