అదేంటి? అనుకుంటున్నారా? ఎక్క‌డైనా వ్య‌క్తికీ-వ్య‌క్తికీ మ‌ధ్య, రాజ‌కీయంగా ఇద్ద‌రు ప్ర‌త్య‌ర్థుల మ‌ధ్య వైరం ఉంటుంది కానీ, మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా లొట్ట‌లేసుకుని మ‌రీ తినే కోడి(చికెన్‌) అంటే ఎవ‌రై నా దూరంగా ఉంటారా?  అసలు మాంసాహార ప్రియులు చికెన్‌ను ఎన్ని ర‌కాలుగా వండుకుని తినాలా? అంటూ.. ఎదురు చూస్తారు. ఏ పండ‌గొచ్చినా.. ఏ శుభ‌కార్యం జ‌రిగినా.. ఏ సంద‌ర్భం వ‌చ్చినా.. `చికిన‌స్య‌.. చికిన్‌.. చికినోభ్యః` అంటూ.. లాగించేయ‌రా?  ఇక‌, ఎవ‌రికైనా మంద‌ల‌వాటుంటే.. చికెన్ ముక్కే.. ప‌ర‌మ స్ట‌ఫ్‌! దాని టేస్టే వేరు.. సిప్పు.. సిప్పుకి.. లెగ్గు పీసు నాలిక‌మీద ప‌డి.. ప‌ళ్ల కింద న‌లిగి.. గొంతు నుంచి జారు తుంటూ.. ఆ కిక్కే వేర‌ప్పా! అని చ‌ప్ప‌రించేయ‌రూ!!


అలాంటి చికెన్ అంటే.. ఇష్ట‌ప‌డ‌ని వారు ఎవ‌రైనా ఉంటారా?  ఎంత భ‌క్తులైనా.. ఎన్ని ఇష్టాల‌ను వ‌దులుకో వాల‌ని అనుకున్నా.. కాశీకి వెళ్లి కూర‌గాయ‌లు వ‌దిలి పెట్టిన‌వారు ఉన్నారే త‌ప్ప‌.. త‌మ‌కు ప్రాణ ప్ర‌ద‌మైన చికెన్ పీసులు వ‌దులుకున్న వారు ఒక్క‌రూ మ‌న‌కు క‌నిపించ‌రు. చికెన్ అంటేనే చాలు.. ఆ వెరైటీ.. ఉం దా.. ఈ వెరైటీ ఉందా..?  అంటూ అడిగి మ‌రీ కొనుక్కుంటారు.. చెప్పి మ‌రీ చేయించుకుంటారు. అలాంటి  కోడి (చికెన్‌)కి వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం జ‌గ‌న్‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే.. భ‌గ్గుమంటుంది తెలుసా?  ఆశ్చ‌ర్యక‌రం గా ఉన్న‌ప్ప‌టికీ.. ఇది నిజం. అంతేకాదు... ``నేను చికెన్ మొహం చూడ‌ను!`` అని జ‌గ‌న్ ఒట్టు కూడా పెట్టుకున్నార‌ట‌! అదేంటి? ఆయ‌న మాసాంహారే క‌దా.. చికెన్ తిన‌క‌పోవ‌డం ఏంటి? ఎందుక‌లా ఒట్టు పెట్టుకున్నారు? అసలు ఏం జ‌రిగింది? అనే సందేహాలు వ‌స్తాయి.. కదా.. ఇదీ విష‌యం.

 

మ‌రి.. జ‌గ‌న్.. అంద‌రూ ఇష్టంగా తినే కోడివిష‌యంలో అలా ఎందుకు శ‌ప‌థం చేయాల్సి వ‌చ్చింది? `నీ మొ హం కూడా నేను చూడ‌ను!` అని ఆయ‌న ఎంద‌కు నిర్ణ‌యం తీసుకున్నారు? అనే విష‌యాల‌ను  ఆయ న మాతృమూర్తి.. విజ‌య‌మ్మ‌.. తాను స్వ‌యంగా రాసుకున్న‌.. `నాలో.. నాతో.. వైఎస్సార్‌` అనే పుస‌క్తంలో చా లా ఆస‌క్తిగా వివ‌రించారు. అది 1996వ సంవ‌త్స‌రం. లోక్‌స‌భ ఎన్నిక‌లు పూర్త‌యి.. కౌంటింగ్ ప్ర‌క్రియ ప్రా రంభ‌మైంది. ఆ సంవ‌త్స‌రం చాలా ట‌ఫ్ ఫైట్‌. టీడీపీ మంచి దూకుడుమీద ఉంది. కాంగ్రెస్ అంటే.. ప్ర‌జ ‌లు చీద‌రించుకుంటున్న ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్థిగా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి బ‌రిలో నిలి చారు. టీడీపీ త‌ర‌ఫున బల‌మైన అభ్య‌ర్థిగా కందుల రాజ‌మోహ‌న్‌రెడ్డి బ‌రిలో ఉన్నారు.  అప్ప‌టి వ‌ర‌కు ఓట మి అనేది ఎరుగ‌ని వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి.. ఈ ఎన్నిక‌ల్లో గెలుపు క‌ష్ట‌మేన‌ని ఎగ్జిట్ పోల్స్ చూచాయ‌గా వెల్ల డించేశాయి. 


దీంతో అటు ఓవ‌రాల్ కాంగ్రెస్ శిబిరంలో టెన్ష‌న్‌, టెన్ష‌న్‌..! మ‌రో వైపు క‌డప జిల్లా వ్యాప్తంగా కూడా ఉత్కం ఠ‌. ఇక‌, వైఎస్ ఫ్యామిలీలో అయితే.. చెప్ప‌లేని ఆవేద‌న‌. ఎవ‌రికి వారు.. దేవుడిని మొక్కుతున్నారు. వైఎస్ కుటుంబం మొత్తం ప్రార్థ‌న‌ల్లో మునిగిపోయింది.  వైఎస్ గెలుపును కోరుకుంటూ వైఎస్ స‌తీమ‌ణి విజ‌య ‌మ్మ‌.. ఏకంగా ఉప‌వాస ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. ఇక‌, ఉద‌యం లేచింది మొద‌లు ఏదో ఒక‌టి తింటూ నోటికి విరామం కూడా ఇవ్వ‌ని వైఎస్ కుమార్తె ష‌ర్మిల కూడా నాన్న గెలుపు కోసం.. ఉప‌వాస ప్రార్థ‌న‌ల్లో చేరిపోయా రు. ఈ స‌మ‌యంలోనే వైఎస్ కుమారుడు, ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్‌.. ``ప్ర‌భూ.. మానాన్నకు ఓట‌మి అంటే తెలియ‌దు. ఇప్పుడు కూడా ఆయ‌న ఓడిపోర‌నే భావిస్తున్నాం. మా విశ్వాసాన్ని కాపాడు ప్ర‌భూ.. `` అని వేడుకుంటూ.. ఉప‌వాస ప్రార్థ‌న‌కు కూర్చున్నారు. 

 

ఇంత‌లో ఆయ‌న మ‌న‌సులో ప్ర‌భువుపై అపార‌మైన ప్రేమతో... `ప్ర‌భూ.. మా నాన్న ఈ ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కితే.. జీవితాంతం నేను చికెన్ ముట్ట‌ను`` అని ఒట్టు పెట్టుకున్నారు. అంతే! ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాయి. ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ.. వైఎస్ విజ‌య‌దుందుభి మోగించారు. అయితే, 1991లో ఆయ‌న 4 ల‌క్ష‌ల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధిస్తే.. 1996 ఎన్నిక‌ల్లో కేవ‌లం 5 వేల ఓట్ల మెజారిటీతో గ‌ట్టెక్కారు. దీనిని బ‌ట్టి చెప్పొచ్చు.. ఫైట్ ఎంత ట‌ఫ్‌గా సాగిందో. సో.. త‌ను చేసిన ప్రార్థ‌న ఆల‌కించిన ప్ర‌భువు.. త‌న తండ్రిని గెలిపించార‌నే విశ్వ‌సంతో తాను పెట్టుకున్న ఒట్టుకు ఇప్ప‌టికీ క‌ట్టుబ‌డి పోయారు జ‌గ‌న్‌. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఆహారంలో చికెన్‌కు చోటు లేదు!! ద‌టీజ్‌.. జ‌గ‌న్‌! ద‌టీజ్.. జ‌గ‌న్‌!!

మరింత సమాచారం తెలుసుకోండి: