ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సమస్యలలో మొట్టమొదటిగా ఉన్న సమస్య ప్లాస్టిక్ ఎక్కువ వాడకం.దీనిపై ప్రభుత్వం ఎన్నోసార్లు ప్లాస్టిక్ ని ఉపయోగించకూడదని చెప్పినా సరె ఎవరో ఒకరు ఎక్కడో ఒక మూల ప్లాస్టిక్ ని ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇలా ప్లాస్టిక్ ని ఉపయోగించటం వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి.


వాటిలో ఒకటి మనం అధికంగా భూమి పై ప్లాస్టిక్ ని పడేయటం వల్ల ఎన్నో సంవత్సరాలుగా భూమి ఉపరితలంపై ఒక పొరగా ఏర్పడి, నీరుని భూమిలోకి ఇంకనివ్వటం లేదు. అలాగే మనం ప్లాస్టిక్ ని ఉపయోగించటం వల్ల పశువులకు నీటిలో ఉండే జలచరాలకు చాలా హాని కలుగుతున్నాయి. పశువులు ఆహారంతో పాటు ప్లాస్టిక్ ని తినటం వల్ల ఆ ఆహారాన్ని అరిగించుకోలేక చనిపోతున్నాయి.


అలాగే నీటి జలాలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యను ఎంతో కొంత నివారించటానికి చత్తీస్ గఢ్ లోని రాయపూర్ లో అంబికాపూర్ మున్సిపాల్టీ వారు ఒక కొత్త ప్రయోగంతో ముందుకు వచ్చారు. దేశంలోనే ఇండోర్ తర్వాత అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరొందిన అంబికాపూర్ మున్సిపాలిటి ఈ నిర్ణయం తీసుకుంది.


ఎవరైతే తమ వద్దకు చెత్తను తీసుకువస్తారో వారికి ఉచితంగా ఆహారాన్ని ఇస్తామనీ ఆశ్రయంలేని వారు ఎవరైనా సరే కేజీ చెత్తను తీసుకుని వస్తే వారికి అరకేజీ ఆహారాన్ని ఉచితంగా ఇస్తామని తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా "గార్బేజ్ కేఫ్" ను చత్తీస్ ఘడ్ లోని రాయపూర్ లో ప్రారంభించారు.


ఇలా సేకరించిన చెత్తను, ప్లాస్టిక్ ను వారు రోడ్ల నిర్మాణంలో ఉపయోగిస్తామని తెలిపారు. అంతే కాకుండా ప్లాస్టిక్ ని సేకరించిన వారికి ఉచితంగా ఇళ్లను కూడా నిర్మించి ఇద్దామని ఆలోచనల్లో ఉన్నట్లు నగర మేయర్ అజయ్ గారు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: