చాలా మంది యువత చదువుకొని ఉద్యోగాలు లేక ఫైళ్లు పట్టుకుని వాళ్ల చుట్టూ.. వీళ్ల‌ తిరుగుతున్నారు.  పొలం అమ్ముకుని చదివించిన తల్లిదండ్రులు పిల్లలకు ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఏదో ఉద్యోగం కోసం కన్సల్టెన్సీలను సంప్రదిస్తూ.. వేలకు వేలు సమర్పించుకుంటారు. ఇక‌ ఇలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నవారికి శుభవార్త. భారతదేశంలో విస్తరిస్తున్న కొత్త రంగాలు మరిన్ని ఉద్యోగావకాశాలను సృష్టిస్తున్నాయి. ఇక తాజ‌గా నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-NEERI ఉద్యోగాల భర్తీ చేపట్టింది. 

 

కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రాజెక్ట్ అసిస్టెంట్-రీసెర్చ్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 95 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు రెండు నోటిఫికేషన్లను వేర్వేరుగా విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు నీరి అధికారిక వెబ్‌సైట్ http://www.neeri.res.in/ ఓపెన్ చేసి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల్ని పోస్ట్ ద్వారా కూడా పంపొచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 

 

CSIR NEERI recruitment 2020: నోటిఫికేషన్ వివరాలు

 

మొత్తం ఖాళీలు- 95
విద్యార్హత- బీఎస్సీ లేదా ఎంఎస్సీ
వయస్సు- 28 నుంచి 30 ఏళ్లు
దరఖాస్తులు పంపాల్సిన మెయిల్ ఐడీ: wtmd@neeri.res.in

 

దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 23
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 31
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Scientist & Head,
WT & M Division,
CSIR- NEERI,
Nagpur- 440 020

మరింత సమాచారం తెలుసుకోండి: