తెలంగాణా వస్తే... ఉద్యోగాలు వస్తాయని భావించిన యువతకు కొన్నాళ్ళుగా నిరాశ ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఉద్యోగాల నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి తెలంగాణా ప్రభుత్వం తాజాగా శుభవార్త ప్రకటించింది. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తాజాగా నిరుద్యోగుల కోసం ఒక కీలక ప్రకటన చేసారు... ఉద్యోగాల కోసం సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

 

నిరుద్యోగులు నిశ్చింతగా ఉండాలన్న ఆయన... నిరుద్యోగులకు త్వరలో శుభవార్త అందుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరిక్షల కోసం ప్రిపేర్ అవ్వాలని పిలుపినిచ్చారు. త్వరలో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తుంది అన్నారు... తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన అనంతరం... ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం కెసిఆర్ సర్కార్... టీఎస్‌పీఎస్‌సీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సరిగా అయిదేళ్ళ క్రితం...

 

డిసెంబర్ 18 2014 న దీనిని కెసిఆర్ సర్కార్... ఏర్పాటు చేసింది... ఇది తాజాగా అయిదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో చక్రపాణి... ఒక టీవీ ఛానల్ తో మాట్లాడారు. గత అయిదేళ్ళ కాలంలో... 101 నోటిఫికేషన్లు జారి చేసామని... ప్రభుత్వ ఉద్యోగాలు 39వేల ఉద్యోగాల భర్తీ చేపట్టామని, అందులో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసామని అన్నారు. 5 వేల నుంచి 6వేల ఉద్యోగాలకు సంబంధించిన కేసులు కోర్టుల్లో ఉన్నట్టు వివరించారు. మిగిలిన మూడు వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: