మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14 వేల‌కుపైగా పోస్టుల్ని భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.  పోస్టుల వారీగా సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు జనవరి 30లోగా ఫీజు చెల్లించి, 31లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200, పరీక్ష ఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. 

 

పోస్టుల వివరాలు చూస్తే.. మొత్తం 14,062 ఖాళీలు ఉన్నాయి. అందులో పంచాయత్ సెక్రెటరీ (గ్రేడ్ 4)- 61, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (గ్రేడ్ 5)- 246ఏఎన్ఎం (గ్రేడ్ 3)- 648, యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్- 6858, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్- 69, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్- 1783, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్ 2)- 536, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్- 43, మహిళా పోలీస్ అండ్ వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్- 762, ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్ 2)- 570, 
పంచాయత్ సెక్రెటరీ (గ్రేడ్ 6) డిజిటల్ అసిస్టెంట్- 1134, విలేజ్ సర్వేయర్ (గ్రేడ్ 3)- 1255, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్- 97 ఖాళీలు ఉన్నాయి.

 

వయోపరిమితి.. 01.07.2O20 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1978 - 01.07.2002 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఈ పోస్టులకు విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. ఇంటర్ నుంచి విద్యార్హతలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు http://gramasachivalayam.ap.gov.in/ వెబ్‌సైట్‌లో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకొని దరఖాస్తు చేయాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: