ఇటీవల కాలంలో ఉన్నత చదువులు అభ్యసించి కూడా ఉద్యోగాలు లేక రోడ్డున పడుతున్న వారు ఎందరో. అయితే అందులో కొందరికి నోటిఫికేషన్ పడుతుందన్న విషయం తెలియకే మంచి అవకాశాలను చేజార్చుకుంటున్నారు. ఇక ఇవన్నీ పక్కన.. బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్-BECIL సంస్థ.. ఏకంగా 4,000 పోస్టుల భర్తీకి ఇటీవల వేర్వేరుగా రెండు నోటిఫికేషన్లను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ల ద్వారా స్కిల్డ్, అన్‌స్కిల్డ్ మ్యాన్‌పవర్‌ని నియమించుకునేందుకు రంగం సిద్ధం చేస్తుంది.
ఇక . 2019 డిసెంబర్ 27 నుంచే ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 11 చివరి తేదీ. అయితే పలు కారణాల వల్ల అప్లై చేయలేని అభ్యర్థులకు మరో అవకాశం కల్పించాలని నిర్ణయించింది. దరఖాస్తు గడువును 2020 మార్చి 20 వరకు పొడిగిస్తూ రివైజ్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను http://www.beciljobs.com/ వెబ్సైట్లో చూడొచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు . ఇదే వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి వారణాసి, గోరఖ్‌పూర్, బస్తీ, జౌన్పూర్, సిద్దార్థ్ నగర్, భదోహి, మీరట్, బులంద్‌షహర్, నోయిడాలో ట్రైనింగ్ ఉంటుంది.
నోటిఫికేషన్ వివరాలు:
మొత్తం ఖాళీలు- 4,000 పోస్టులు
స్కిల్డ్ మ్యాన్ పవర్ (ఎలక్ట్రీషియన్ / లైన్మెన్ / ఎస్ఎస్ఓ)- 2,000 పోస్టులు అన్‌స్కిల్డ్ మ్యాన్ పవర్ (అసిస్టెంట్ లైన్మెన్)- 2,000 పోస్టులు
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 27
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 20
విద్యార్హత.. ఎనిమిదో తరగతితో పాటు ఐటీఐ పాస్ అవ్వాలి.
వయస్సు.. 18 నుంచి 45 ఏళ్లు