ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు మరో శుభవార్త వెలువడింది. ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు ప‌డుతున్న‌వారికి, ఉన్న‌త చ‌దువులు అభ్య‌సించి కూడా కుటుంబాన్ని పోషించ‌లేక‌పోతున్నవారికి విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ గుడ్ న్యూస్ తెలిపింది. విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 51 ఖాళీలు ఉన్నాయి. డిజైనర్, జూనియర్ సూపర్‌వైజర్, ఆఫీస్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. 

 

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.hslvizag.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 2020 ఏప్రిల్ 7 సాయంత్రం 5 గంటల్లోగా అప్లై చేయాలి. దరఖాస్తు ఫీజు- రూ.200. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఫీజు లేదు. ఇక సంబంధిత విభాగంలో డిప్లొమా, గ్రాడ్యుయేట్ పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చూడండి. 

 

పోస్టులను ప‌రిశీలిస్తే.. 
మొత్తం ఖాళీలే- 51
డిజైనర్ Gr-IV (మెకానికల్)- 10
డిజైనర్ Gr-IV (ఎలక్ట్రికల్)- 03
జూనియర్ సూపర్‌వైజర్ Gr-III (మెకానికల్)- 07

 

జూనియర్ సూపర్‌వైజర్ Gr-III (ఎలక్ట్రికల్)- 09
జూనియర్ సూపర్‌వైజర్ Gr-III (సివిల్)- 07
ఆఫీస్ అసిస్టెంట్ (సెక్రెటేరియల్) Gr-V- 09
జూనియర్ ఫైర్ ఇన్‌స్పెక్టర్ Gr-IV- 04
డ్రైవర్ Gr V- 02


  

మరింత సమాచారం తెలుసుకోండి: