ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను చూట్టేస్తుంది. ఈ వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. నివార‌ణ‌పైనే అంద‌రూ దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలోనే దేశ‌దేశాల లాక్‌డౌన్ విధించాయి. ఈ క్ర‌మంలోనే విద్యాసంస్థ‌లు, థియేట‌ర్లు, షాపింగ్స్ మాల్స్ లాంటి బంద్ అయ్యాయి. అయితే  విద్యాసంస్థ‌లు మూత ప‌డ‌డంతో చాలా మంది విద్యార్థులు పాఠాలను మిస్ అవుతున్నారు. ఇక అసలే పరీక్షల సమయం. ఇంతలో క‌రోనా కార‌ణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించ‌డంతో ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. అయితే ఆ పరీక్షలకు ఇంకా బాగా చదువుకోవడానికి సమయం దొరికింది. 

 

మ‌రి స్కూల్ వెళ్ల‌కుండా.. ఎలా ప్రిపేర్ అవుతాము అన్న ప్ర‌శ్న‌లు చాలా మందికి రావొచ్చు. కాని, ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌లో చదువుకోవడానికి, నేర్చుకోవడానికి అనేక అవకాశాలున్నాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ-MHRD, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్-NCTE కలిసి దీక్ష పేరుతో డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ని రూపొందించాయి. వెబ్‌సైట్‌తో పాటు యాప్ కూడా ఉన్నాయి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్-NCERT రూపొందించిన పాఠ్యపుస్తకాలన్నింటికీ క్యూఆర్ కోడ్ ఉంటుంది. 

 

దీక్ష యాప్ డౌన్‌లోడ్ చేసుకొని క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే సంబంధిత టాపిక్స్ ఓపెన్ అవుతాయి. ఇక ఇందులో లొకేషన్‌ని బట్టి కోర్సులు కనిపిస్తాయి. ఉదాహరణకు హైదరాబాద్ లొకేషన్ సెలెక్ట్ చేస్తే ఈ ప్రాంతంలో విద్యా విధానాన్ని బట్టి పుస్తకాలు, కోర్సులు ఉంటాయి. ఉపాధ్యాయులు కూడా లెస్సన్ ప్లాన్స్, వర్క్ షీట్స్, యాక్టివిటీస్ కోసం దీక్ష ప్లాట్‌ఫామ్ ఉపయోగించుకోవచ్చు.  విద్యార్థులు స్టడీ మెటీరియల్‌ను ఇక్కడ యాక్సెస్ చేయచ్చు. పాఠాలు నేర్చుకున్న తర్వాత సెల్ఫ్ అసెస్‌మెంట్ ప్రాక్టీస్ ఎక్సర్‌సైజెస్ చేయొచ్చు. ఇంకెందుకు ఆల‌స్యం ఈ యాప్‌ను మీరూ ఉప‌యోగించుకోండి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: