డిగ్రీ పాస్ అయ్యారా..? మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్ అందించింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. oil CORPORATION' target='_blank' title='ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇప్పటికే ఇంజనీర్, ఆఫీసర్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఓ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు https://www.iocl.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. విద్యార్హత విషయానికి వస్తే.. కనీసం 55% మార్కులతో డిగ్రీ పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు 50% మార్కులతో పాస్ అయితే చాలు. సీఏ ఇంటర్మీడియట్, సీఎంఏ ఇంటర్మీడియట్ పాసై ఉండాలి. అలాగే కనీసం మూడేళ్లు ఫైనాన్స్ విభాగంలో పనిచేసిన అనుభవం తప్పనిసరి.
సీఏ ఇంటర్మీడియట్, సీఎంఏ ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కుల ఆధారంగా దరఖాస్తుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. అలాగే వయస్సు 30 ఏళ్లు ఉండాలి. వేతనం నెలకు రూ.40,000 ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 మే 6 చివరి తేదీ. కాబట్టి.. ఆసక్తికర అభ్యర్థులు వెంటనే దరఖాస్తు ప్రారంభించండి.