ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టి పీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఏపీని సైతం వ‌ణికిస్తుంది. ఎన్ని క‌ఠ‌న చ‌ర్య‌లు తీసుకుంటున్నా రోజురోజుకు ఇక్క‌డ క‌రోనా కేసులు పెరుగుతూ వ‌స్తున్నాయి. రాష్ట్రంలో కేసుల్లో గుంటూరు జిల్లా టాప్‌లో ఉంది. మొత్తం 13 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు 11 జిల్లాల్లో నమోదుకాగా.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే క‌రోనాకు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. నివార‌ణ‌పైనే దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఈ క్ర‌మంలోనే ఎక్క‌డిక‌క్క‌డ లాక్‌డౌన్ విధించ‌డంతో పాటు క‌ఠ‌న చ‌ర్య‌లు చేప‌ట్టింది.

 

అలాగే ఇలాంటి సమయంలో  వైద్యుల కోసం కోవిడ్ స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నోటిఫికేషన్‌ను ఏపీ వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు dme.ap.nic.in వెబ్‌సైట్లో పొందుపరిచారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్, జిల్లా ఆస్పత్రులలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక సంవత్సర కాలం పనిచేయుటకు స్పెషలిస్టులు, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ల పోస్టుకు దరఖాస్తులను స్వీక‌రిస్తోంది.

 

మొత్తం 592 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (ఎంబీబీఎస్) పోస్టులు ఉన్నాయి. అందులో స్పెషలిస్ట్ ఇన్ జనరల్ మెడిసిన్ (ఎండీ లేదా డీఎన్‌బీ జనరల్ మెడిసిన్)+స్పెషలిస్ట్ ఇన్ పల్మనరీ మెడిసిన్ (ఎండీ లేదా డీఎన్‌బీ పల్మనరీ మెడిసిన్) 400 పోస్టులు ఉండ‌గా.. స్పెషలిస్ట్ ఇన్ అనస్తీసియాలజీ (ఎండీ లేదా డీఎన్‌బీ అనస్తీషియాలజీ) 192 ఉన్నాయి. ఆస‌క్తిగ‌త అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఏప్రిల్ 19తో దరఖాస్తు తేది ముగుస్తుంది. వేత‌నాల వివ‌రాలు చూస్తే.. స్పెషలిస్ట్స్.. Rs. 1,10, 000 మ‌రియు జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు..  Rs.53,945 ఇవ్వ‌నున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: