క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ఎక్క‌డో చైనా దేశం వుహాన్ ప‌ట్ట‌ణంలో పుట్టి.. అతి త‌క్కువ స‌మ‌యంలో ప్ర‌పంచ‌దేశాలను అత‌లాకుత‌లం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే యుద్ధాలు చేసినపుడు కూడా జరగని ప్రాణ నష్టం.. కరోనా వల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌రుగుతోంది. కంటికి క‌నిపించ‌కుండా ఈ క‌రోనా భూతం యావ‌త్ దేశాల‌ను వ‌ణికిస్తోంది. మ‌రోవైపు కరోనా ఎఫెక్ట్‌ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్ర‌మంలోనే చాలా కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. దీంతో ఉద్యోగులు కాస్త నిరుద్యోగులుగా మారుతున్నారు. అయితే విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో.. oil CORPORATION' target='_blank' title='ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్.. ఈస్టర్న్ రీజియన్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

 

ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 404 పోస్టుల్ని ప్రకటించింది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంట్, మెషినిస్ట్ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటీస్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిషా, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది ఐఓసీఎల్. ఇక ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం మొత్తం ఖాళీలు 404 ఉండ‌గా.. అందులో టెక్నీషియన్ అప్రెంటీస్- 221, ట్రేడ్ అప్రెంటీస్- 168, ట్రేడ్ అప్రెంటీస్ (అకౌంటెంట్)- 15 పోస్టులు ఉన్నాయి.

 

విద్యార్హత విష‌యానికి వ‌స్తే.. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు డిప్లొమా, ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉండాలి. అలాగే 18 నుంచి 24 ఏళ్లు వ‌య‌స్సు ఉండా. అయితే ఈ పోస్టుల‌కు ఏడాది అనుభవం ఉన్నవారు, ఇప్పటికే శిక్షణ తీసుకున్నవారు దరఖాస్తు చేయకూడదు. దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 18 చివరి తేదీ. అంటే మ‌రి కొన్ని రోజులు మాత్ర‌మే గ‌డువు మిగిలి ఉంది. కాబ‌ట్టి, ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను. ఇక ఈ నోటిఫికేష‌న్ మ‌రిన్ని వివ‌రాల కోసం ఐఓసీఎల్ అధికారిక వెబ్‌సైట్ https://www.iocl.com/ ఓపెన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: