ప్ర‌స్తుతం ప్రపంచ‌వ్యాప్తంగా క‌రోనా అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అన్ని దేశాలు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో దీనిని క‌ట్ట‌డి చేయ‌డం ప్ర‌పంచ‌దేశాల‌కు పెద్ద స‌వాల్‌గా మారింది. అయిన‌ప్ప‌టికీ కంటికి క‌నిపించ‌ని క‌రోనాతో దేశ‌దేశాలు పోరాటం చేస్తూనే ఉన్నాయి. ఇక కరోనా దెబ్బకు అన్నిరంగాలు విలవిలలాడిపోతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. ఇక రోజువారి కూలీల పరిస్థితి అయితే మరీ అద్వాన్నంగా తయారవుతోంది. 

 

ఎందురో ఉద్యోగులు నిరుద్యోగులుగా మారుతున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్-NTPC  ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌డానికి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.  ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది 2020 జూన్ 16న ప్రారంభమైంది. దరఖాస్తుకు జూలై 6 చివరి తేదీ.

 

ఇక ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 100 ఖాళీలు ఉండ‌గా.. అందులో ఎలక్ట్రికల్- 30, మెకానికల్- 45 మ‌రియు ఎలక్ట్రానిక్స్ / ఇన్‌స్ట్టుమెంటేషన్ ఇంజనీర్- 25 పోస్టులు ఉన్నాయి. విద్యార్హత విష‌యానికి వ‌స్తే.. సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ ఉండాలి. గేట్ 2020 స్కోర్. అలాగే ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థి వ‌య‌స్సు 27 ఏళ్లు ఉండాలి. ఇక‌ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.150 చ‌ల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ద‌ర‌ఖాస్తు ఫీజు లేదు. గేట్ స్కోర్ 2020 ఆధారంగా దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టుల‌కు ఎంపిక విధానం ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://ntpccareers.net/ వెబ్‌సైట్‌లో ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: