ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను వ‌ణికిస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది చైనాలో వెలుగుచూసిన ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. అటు ప్ర‌జ‌లకు, ఇటు ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా మనీ పవర్‌తో గ్లోబ్‌పై ఉన్న దేశాలను శాసించే అమెరికాను కంటికి కనిపించని శత్రువు వణికిస్తోంది. మ‌రోవైపు క‌రోనా రాకాసి ప్రభావంతో కోట్లాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డుపడతున్నారు. దీని ప్రభావం ముందు ముందు మరింత తీవ్రంగా ఉంటుందని ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను చూస్తేనే అర్థం అవుతోంది. 

 

అయితే ఇలాంటి స‌మ‌యంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తూ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 100 ఉద్యోగాల‌ను ప్ర‌క‌టించింది. ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఖాళీల వివ‌రాలు చూస్తే.. మొత్తం 100 ఖాళీలు ఉండగా అందులో ఎలక్ట్రికల్- 30, మెకానికల్- 45, ఎలక్ట్రానిక్స్ / ఇన్‌స్ట్టుమెంటేషన్ ఇంజనీర్- 25 పోస్టులున్నాయి.

 

 సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. గేట్ 2020 స్కోర్ తప్పనిసరిగా ఉండాలి. గేట్ స్కోర్ 2020 ఆధారంగా దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మ‌రియు అభ్యర్థుల వయస్సు 27 ఏళ్లు లోపు ఉండాలి. అలాగే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.150 ద‌ర‌ఖాస్తు ఫీజు చ‌ల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://ntpccareers.net/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవ‌చ్చు. ఇక 2020 జూన్ 16న ద‌ర‌ఖాస్తు ప్రారంభం కాగా, దరఖాస్తుకు జూలై 6 చివరి తేదీ. అంటే మ‌రో మ‌రో రెండు రోజులే గ‌డువు మిగిలి ఉంది. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాలు తెలుసుకుని వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను.

మరింత సమాచారం తెలుసుకోండి: