ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విశ్వ‌రూపం చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అంద‌రూ బ‌లైపోతున్నారు. భారత్‌ సహా ప్రపంచ దేశాలపై పంజా విసురుతోంది. రోజుల త‌ర‌బ‌డి లాక్‌డౌన్ అమ‌లు చేసినా.. ఫ‌లితం లేకుండా పోయింది. ఈ క్ర‌మంలోనే అన్‌లాక్ ప్ర‌క్రియ ప్రారంభించ‌డంతో.. అడ్డు అదుపు లేకుండా క‌రోనా మ‌రింత వేగంగా విజృంభిస్తోంది. ఈ క్ర‌మంలోనే రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌, మ‌ర‌ణాలు సంఖ్య భారీ స్థాయిలో పెరిగింది.

 

ఇక మ‌రోవైపు కంటికి కనిపించని కరోనా దెబ్బకు అన్నిరంగాలు విలవిలలాడిపోతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. ఈ క్ర‌మంలోనే అప్పుల భారం త‌ట్టుకోలేని ప‌లు కంపెనీ త‌మ ఉద్యోగుల‌ను ఇంటికి సాగ‌నంపుతున్నాయి. అయితే ఇలాంటి స‌మ‌యంలో రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఉద్యోగాలు భ‌ర్తి చేస్తూ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 393 ఖాళీలు ప్ర‌కటించింది. మేనేజ్‌మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

 

వాటి వివ‌రాలు చూస్తే.. మొత్తం 393 ఖాళీల్లో.. ఆపరేటర్ ట్రైనీ (కెమికల్)- 124, మేనేజ్‌మెంట్ ట్రైనీ (కెమికల్)- 60, మేనేజ్‌మెంట్ ట్రైనీ (మెకానికల్)- 48, మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 22, మేనేజ్‌మెంట్ ట్రైనీ (బాయిలర్)- 21, అసిస్టెంట్ ఆఫీసర్ (మార్కెటింగ్)- 14, ఇంజనీర్ (కెమికల్)- 10, ఆఫీసర్ (మార్కెటింగ్)- 10 పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. 2020 జూలై 15 ద‌ర‌ఖాస్తుకు ఆఖ‌రి తేది. అంటే మ‌రో రెండు రోజులు మాత్ర‌మే గ‌డువు మిగిలి ఉంది. కాబ‌ట్టి, ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాలు తెలుసుకుని వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను. ఇక‌ ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://www.rcfltd.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవ‌చ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: