విద్యార్థులు అశ్లీల వెబ్‌సైట్ల జోలికి పోకుండా పాఠశాలల ప్రాంగణాల్లో జామర్ల అమర్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఇంతకుముందు కోర్టుకు చెప్పిన విధంగా స్కూల్‌ బస్సుల్లో వీటిని అమర్చడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, ఏఎం ఖాన్‌విల్కర్‌, ఎంఎం శంతనగౌడర్‌తో కూడిన ధర్మాసనానికి అదనపు సొలిసిటర్‌ జనరల్‌ పింకీ ఆనంద్‌, న్యాయవాది రాజేష్‌ రంజన్‌ ప్రభుత్వ ప్రయత్నాలను వివరించారు. జామర్ల ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలని సీబీఎ్‌సఈని కోరామని వారు తెలిపారు.‘


చైల్డ్‌ పొర్నోగ్రఫీ’ వెబ్‌సైట్లకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ గత నెలలో 3500 సైట్లను నిరోధించామని చెప్పారు. ఈ విషయంలో కేంద్రం ఇంటర్‌పోల్‌ సహకారం కోరిందని, సీబీఐ ఆ సంస్థతో సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు. చైల్డ్‌ పొర్నోగ్రఫీ సైట్లను పూర్తిగా నిషేధించాలని కోరుతూ కమలేశ్‌ వాస్వాని దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. బహిరంగ ప్రదేశాల్లో అశ్లీల వీడియోలు చూసే వారిని శిక్షించేందుకు వీలుగా కూడా చట్టం రూపొందించాలని పిటీషనర్‌ తరపు న్యాయవాది విజయ్‌ పంజ్వానీ అన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: