తెలంగాణలో ఇప్పటివరకు భారీ స్థాయిలో ఉద్యోగనియామకాలు జరగలేదు..ఐతే అప్పుడప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనల్ని చేస్తూ నిరుద్యోగులని సంతృప్తి పరుస్తున్నా..అది కేవలం కొంతమందిని మాత్రమే సంతృప్తి పరుస్తున్నాయి. అయితే నిరుద్యోగుల విషయంలో కేసీఆర్ చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు ఒక పక్క ప్రతిపక్షాలు..మరోపక్క  టీచర్ల భర్తీకి వరుసగా నోటిఫికేషన్ విడుదల చేస్తున్నా.. మిగిలిన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంపై నిరుద్యోగులు కూడా గుర్రుగా ఉన్నారు. అసెంబ్లీలో వీటిమీద ప్రశ్నించి ఇరకాటంలోకి కేసీఆర్ ని నెట్టాలని భావించారు కాంగ్రెస్ వాళ్ళు. వీటన్నింటినీ ముందే ఊహించిన కేసీఆర్..నిరుద్యోగులకి తీపి కబురు అందించారు.

 

త్వరలోనే లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు...  ఇందులో భాగంగా గ్రూప్-2 - అంబేడ్కర్ ఓవర్ సీస్ పథకంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానమిచ్చారు. త‍్వరలో లక్షా 12 వేల ఉద్యోగాలు 100 శాతం భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. అంబేద్కర్ ఓవర్ సీస్ పథకానికి పరిమితి లేదన్నారు. అర్హులందరికీ ఈ పథకం వర్తింప చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. బలహీన వర్గాల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని ఈ సందర్భంగా తెలియజేశారు.


ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా భర్తీ ఉంటుందన్నారు.. ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగానే భర్తీ ఉంటుందని సీఎం అన్నారు. టీఎస్ పీఎస్సీలో అనేక సంస్కరణలు చేపట్టిన ఘంటా చక్రపాణిని యూపీఎస్సీ అభినందించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం టీఆరెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం చేస్తున్న నోటిఫికేషన్లు మరెక్కడా..ఇతర రాష్ట్రాలు ఇవ్వడం లేదని కేసీఆర్ గుర్తు చేశారు. ఏది ఏమైనా కేసీఆర్ ప్రకటించిన ఈ లక్ష ఉద్యోగాల ప్రకటన నిరుద్యోగులకి పండగలాంటిదే అని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: