ముంబైలోని షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌సీఐఎల్).. గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజనీర్స్ (జీఎంఈ) కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహ మెకానికల్ ఇంజనీర్స్ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ కోర్సు ఎస్‌సీఐఎల్‌కు చెందిన మారిటైమ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఎంటీఐ), ముంబైలో 2018, మార్చి 1న ప్రారంభమవుతుంది.

 Image result for shipping corporation of india admission

కోర్సు:  గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజనీర్స్ (జీఎంఈ).

మొత్తం సీట్లు:  40 (అన్‌రిజర్వుడ్-20+ఓబీసీ-11+ఎస్సీ-6+ఎస్టీ-3).

శిక్షణ వ్యవధి: 18 నెలలు. ఇందులో 8 నెలల ప్రి-సీ ట్రైనింగ్, 10 నెలలు స్ట్రక్చర్డ్ షిప్‌బోర్డ్ ట్రైనింగ్. 

స్టైపెండ్: రూ.15,000 (స్ట్రక్చర్డ్ షిప్‌బోర్డ్ ట్రైనింగ్‌లో).

అర్హతలు: మెకానికల్ ఇంజనీరింగ్‌లో కనీసం 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా తత్సమాన విద్య. అలాగే పదోతరగతి, ఇంటర్మీడియెట్‌లో ఇంగ్లిష్ సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాలి. 

వయసు: 2018, మార్చి 1 నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, మహిళలకు రెండేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

ఎంపిక: ఆల్ ఇండియా ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ. 

ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలు: ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కత, చెన్నై. 

దరఖాస్తు రుసుం:  రూ.1,000 (జనరల్/ఓబీసీ); రూ.500 (ఎస్సీ/ఎస్టీ). 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్. 

చివరి తేదీ:  జనవరి 20, 2018. 

దరఖాస్తు చేరడానికి చివరి తేదీ:  జనవరి 23, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:    www.shipindia.com


మరింత సమాచారం తెలుసుకోండి: