ఇండియన్ కోస్ట్ గార్డు లో  యాంత్రిక్ పోస్టుల భర్తీకి అర్హులైన యువకుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువడింది. ఎంపికైన అభ్యర్థులకు యాంత్రిక్ 02/2018 కోర్సు ద్వారా శిక్షణ ఇచ్చి నియామకం కల్పిస్తారు. కోర్సు ఆగస్టులో ప్రారంభమవుతుంది.

Image result for indian coast guard

పోస్టు పేరు: యాంత్రిక్.


వేతనం: రూ.29,200 (బేసిక్ పే)+ఇతర అలవెన్సులు.

అర్హతలు: పదోతరగతి/తత్సమాన విద్యతోపాటు కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిప్లొమా (ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ (రేడియో/పవర్)) ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులతోపాటు క్రీడల్లో అంతర్జాతీయ/జాతీయస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ (ప్రథమ/ద్వితీయ/తృతీయ స్థానం) కనబరిచిన అభ్యర్థులకు మార్కుల శాతంలో 5 శాతం మినహాయింపు ఉంటుంది.

వయసు: 18-22 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

శారీరక ప్రమాణాలు : ఎత్తు-157 సెం.మీ. ఉండాలి. ఛాతీ తగినంత ఉండి గాలిపీల్చినపుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించగలగాలి. ఎత్తు, వయసుకు అనుగుణంగా బరువు (10 శాతం ఎక్కువున్నా/తక్కువున్నా అనుమతిస్తారు) ఉండాలి. అలాగే తగినంత వినికిడి, దృష్టి సామర్థ్యం (6/24; 6/9, 6/12) తప్పనిసరి. పచ్చబొట్లు (టాటూ) ఉండకూడదు. 
ఎంపిక:  రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ), మెడికల్ ఎగ్జామినేషన్. 

పీఎఫ్‌టీ: రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో 1.6 కి.మీ. దూరాన్ని 7 నిమిషాల్లో పరిగెత్తగలగాలి. అలాగే నిర్దేశిత సమయానికి 20 స్కాటప్స్ (ఉఠక్ బైఠక్), 10 పుషప్స్ తీయగలగాలి. పీఎఫ్‌టీలో ఉత్తీర్ణులైనవారికి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రాతపరీక్ష, పీఎఫ్‌టీ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేసి ఐఎన్‌ఎస్ చిల్కాలో శిక్షణకు ఎంపిక చేస్తారు.

రాతపరీక్ష విధానం:  ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పశ్నపత్రంలో సంబంధిత విభాగం (అభ్యర్థి విద్యార్హతను బట్టి)తోపాటు జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. 

రాతపరీక్ష కేంద్రాలు:  ముంబై, చెన్నై, కోల్‌కతా, నోయిడా. 
దరఖాస్తు విధానం:   ఆన్‌లైన్.
దరఖాస్తుల ప్రారంభం:  జనవరి 12, 2018.
దరఖాస్తు చివరి తేదీ:  జనవరి 19, 2018.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   www.joinindiancoastguard.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: