న్యూఢిల్లీ, తిరుపతిలో ఉన్న మూడు సంస్కృత విశ్వవిద్యాలయాల్లో బీఈడీ, ఎంఈడీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఎంట్రెన్స్ టెస్ట్స్-2018 ప్రకటన వెలువడింది...వివిధ కోర్సుల్లో ఆయా భాగాలకి సంభందిచి కాలపరిమితి ప్రకారం ఉంటుంది..

Image result for రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం

 

కోర్సులు-వ్యవధి: శిక్షా శాస్త్రి(బీఈడీ)-రెండేళ్లు; శిక్షా ఆచార్య(ఎం ఈడీ)-రెండేళ్లు; విద్యావారధి (పీహెచ్‌డీ)-మూడేళ్లు. 

అర్హతలు: శిక్షా శాస్త్రకు.. కనీసం 50శాతం మార్కులతో శాస్త్రి/బీఏ(సంస్కృతం)తోపాటు ఆచార్య/ఎంఏ (సంస్కృతం); శిక్షా ఆచార్యకు... కనీసం 50శాతం మార్కులతో శిక్షా శాస్త్రి/బీఈడీ(సంస్కృత బోధన) లేదా శాస్త్రి/ బీఏ(సంస్కృతం) తోపాటు ఆచార్య/ఎంఏ(సంస్కృతం); విద్యావారధికి... కనీసం 55శాతం మార్కులతో ఆచార్య/శిక్షా ఆచార్య/ ఎంఏ(సంస్కృతం) ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సుల తుది సంవత్సరం విద్యార్థులూ అర్హులే. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులకు మార్కుల శాతంలో 5శాతం సడలింపు ఉంటుంది. విద్యావారధికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంస్కృతం/ఎడ్యుకేషన్‌లో జేఆర్‌ఎఫ్/నెట్/స్లెట్ ఉత్తీర్ణులై ఉంటే వారికి ఎంట్రెన్స్ టెస్ట్ నుంచి మినహాయింపు ఉంటుంది. 

వయస్సు: 2018, అక్టోబర్ 1 నాటికి శిక్షా శాస్త్రకు కనీసం 20 ఏళ్లు, శిక్షా ఆచార్యకు కనీసం 22 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తు రుసుం: రూ.1,200. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్. 

దరఖాస్తు చివరి తేదీ: మార్చి 10, 2018. 

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్స్:  rsvidyapeetha.ac.inwww.sanskrit.nic.inwww.slbsrsv.ac.in


మరింత సమాచారం తెలుసుకోండి: