పెళ్ళికాని యువతీ యువకులకి మాత్రమే అంటూ కండిషన్ అప్లై చేస్తూ ఎయిర్ ఇండియా ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది..సుమారు 500 క్యాబిన్ క్రూ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది..వివరాలలోకి వెళ్తే..ఈ పోస్టుల భర్తీని రిజియన్ల వారీగా భర్తీ చేస్తోంది..నారర్న్ ,వెస్ట్రన్ రిజియన్స్ లో భార్తీలు నిర్వహిస్తోంది..

500 Cabin Crew Jobs At Air India; Check Details Here

పోస్టు పేరు : క్యాబిన్ క్రూ.

మొత్తం ఖాళీలు: 500 (పురుషులు-163+ మహిళలు-337).

రీజియన్ల వారీ ఖాళీలు: నార్తర్న్ రీజియన్ (ఢిల్లీ)-450 (పురుషులు-150+ మహిళలు-300); వెస్ట్రన్ రీజియన్ (ముంబై)-50 (పురుషులు-13+ మహిళలు-37). 

వేతనం: శిక్షణలో స్టైపెండ్ నెలకు రూ.15,000; ఉద్యోగంలో చేరాక మొదటి ఏడాది రూ.18,400. దీంతోపాటు ఫ్లైయింగ్ అలవెన్సు-రూ.21,125, ఇంటర్నేషనల్ క్యూటీఏ తదితరాల కింద అదనపు చెల్లింపులు ఉంటాయి. 

అర్హతలు: ఇంటర్మీడియెట్/తత్సమాన విద్యతోపాటు ఏదైనా షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్స్‌లో క్యాబిన్ క్రూగా పనిచేస్తూ, కనీసం ఏడాది అనుభవం కలిగి ఉండాలి. అలాగే ఏదైనా ఎయిర్‌బస్/బోయింగ్ ఫ్యామిలీ ఎయిర్‌క్రాఫ్ట్‌కు సంబంధించిన సెప్ (ఎస్‌ఈపీ) ఉండాలి. అలాగే ఇంగ్లిష్, హిందీ భాషల్లో పట్టు తప్పనిసరి. 
శారీరర, ఆరోగ్య ప్రమాణాలు: ఎత్తు-పురుషులు కనీసం 172 సెం.మీ., మహిళలు కనీసం 160 సెం.మీ. ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలతోపాటు ఈశాన్య రాష్ట్రాల అభ్యర్థులకు 2.5 సెం.మీ. సడలింపు ఇస్తారు; బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ)- పురుషులకు 18-25 లోపు, మహిళలకు 18-22 లోపు ఉండాలి. అలాగే తగిన దృష్టి సామర్థ్యం (ఎన్/5, ఎన్/6; 6/6, 6/9), ఇషిహార/టోక్యో మెడికల్ కాలేజ్ చార్ట్ మేరకు తగిన కలర్ విజన్ ఉండాలి. అలాగే స్పష్టంగా మాట్లాడగలగాలి. 

వయసు: దరఖాస్తు గడువు ముగిసే నాటికి 18-35 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీకి ఐదేళ్లు, ఓబీసీకి మూడేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

ఎంపిక: మెడికల్ ఎగ్జామినేషన్, రాతపరీక్ష.

దరఖాస్తు రుసుం: రూ.1,000; ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తు చివరి తేదీ: మార్చి 12, 2018. 
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్:   airindia.in


మరింత సమాచారం తెలుసుకోండి: