ఆడవారికి  ఏదయినా రహస్యం కానీ లేక  విషయం తెలిసినపుడు  నిజానిజాలు తెలుసుకోకుండా ఆ వార్తను పట్టుమని పదిమందతో చెప్పకుండా  ఉండలేరు. అయితే ఇది పాత కాలం నానుడి. సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నవాడు రూమర్స్ ని క్రియేట్ చేయకుండా ఉండలేడు. ఇది ఈ కాలపు కొత్త నిర్వచనం. సోషల్ మీడియా అకౌంట్ ఉంటే చాలు అది నిజమో, కాదో అని తెలుసుకోకుండా తోచింది రాసి నెట్లో పెట్టడం ఈ కాలపు యువతకు అదో సరదా.


ఏ ప్రబుద్ధుడు ఈ రూమర్ ని సృష్టించాడో కానీ దాని  దెబ్బకు ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు తీవ్రంగా కుమిలిపోతున్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంకు సంబందించి మ్యాథమెటిక్స్1బి , హిస్టరీ-1 బోటనీ-1 పరీక్షలను రద్దు చేసి మళ్ళీ నిర్వహించబోతున్నారు అని తెలియజేసే ఒక పోస్ట్ గత 24 గంటల నుండి సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది. జిల్లా విద్యాశాఖాధికారి గారి ఆదేశానుసారం ఈ పరీక్షలు రద్దుచేసి మళ్ళీ నిర్వహిస్తారు అని అందులో పేర్కొనడం గమనార్హం.


అయితే దాన్ని చూసి విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు. ఆ పరీక్షలను బాగా రాసిన విద్యార్థులు మళ్ళీ పరీక్ష పెడితే పేపర్ ఎలా వస్తుందో అని మదనపడుతున్నారు. ఈ పరీక్షల రద్దు అన్న విషయం ఇంటర్ బోర్డు అధికారులకు తెలిసింది. ఆ రూమర్లకు సంబందించి బోర్డు ఉన్నతాధికారులు స్పందించారు. అవి అన్నీ ఆకతాయిల చేష్టలని కొట్టిపడేశారు. ఇంటర్ కు సంబందించి షెడ్యూల్ లో ఎటువంటి మార్పులేదని, అన్ని పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎటువంటి రూమర్లని నమ్మవద్దని వారు సూచించారు. సో ఏ పరీక్ష కూడా రద్దు కాలేదు. ఇంటర్ పరీక్షలు రాస్తున్న మీ పిల్లలకి ఈ విషయం తప్పకుండా తెలపండి.


మరింత సమాచారం తెలుసుకోండి: