గౌరవనీయ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా (ఎస్‌సీఐ)లో ఉన్న 78 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేశారు. 78 లకి గాను జూనియర్ కోర్ట్ అటెండెంట్, చాంబర్ అటెండెంట్ ఈ  రెండు విభాగాలలో ఈ పోస్టుల భర్తీ జరుగనుంది..

Image result for indian supreme court logo

పోస్టు-ఖాళీలు: జూనియర్ కోర్ట్ అటెండెంట్-65; చాంబర్ అటెండెంట్ (ఆర్)-13. 
వేతనం: రూ.33,315.
అర్హతలు: పదోతరగతి/తత్సమాన విద్యలో ఉత్తీర్ణత. అలాగే జూనియర్ అటెండెంట్ పోస్టులకు అదనంగా డ్రైవింగ్ లెసైన్స్(ఎల్‌ఎంవీ/హెచ్‌ఎం వీ)తోపాటు కుకింగ్/ ఎలక్ట్రీషియన్/కార్పెంటరీలో ప్రావీణ్యం, అనుభవం ఉన్నవాళ్లకు ప్రాధాన్యం ఇస్తారు. చాంబర్ అటెండెంట్‌కు అదనంగా హౌస్ కీపింగ్ వర్క్, వాచ్ అండ్ వార్డ్, సెక్యూరిటీ అండ్ కేర్‌టేకింగ్ పనిలో నైపుణ్యం, అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. 
వయసు: 2018 మార్చి 1 నాటికి 18-27 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్లు వర్తిస్తాయి. 
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్. 
రాతపరీక్ష విధానం: దీన్ని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమెరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్ విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీల్లో మాత్రమే ఉంటుంది. పరీక్ష వ్యవధి గంటన్నర. రెండు పోస్టులకూ వేర్వేరు స్థాయిలోని ప్రశ్నలు ఇస్తారు. రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మెరిట్ జాబితా ప్రకారం స్కిల్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. ఇందులో అభ్యర్థుల డ్రైవింగ్/కుకింగ్/ ఎలక్ట్రీషి యన్/కార్పెంటరీ/ హౌస్ కీపింగ్/ వాచ్ అండ్ వార్డ్/సెక్యూరిటీ అండ్ కేర్‌టేకింగ్) నైపుణ్యాలను పరిశీలిస్తారు. దీన్ని అర్హత పరీక్షగా పరిగణిస్తారు. 
దరఖాస్తు రుసుం: రూ.300 (ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/మాజీసైనికోద్యోగ/డిపెండెంట్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ కేటగిరీలకు ఫీజు లేదు). 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్. 
దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2018.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చు.
వెబ్‌సైట్:   sci.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: