ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ.. 2018కి గాను డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (డీఈఈ సెట్-2018) నోటిఫికేషన్ విడుదల చేసింది...దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ డైట్ (డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్) కళాశాలలు, ప్రైవేటు ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ) కోర్సులో ప్రవేశం పొందొచ్చు. రెండేళ్ల వ్యవధి గల ఈ కోర్సు పూర్తిచేయడం ద్వారా ఉపాధ్యా య వృత్తికి బాటలు వేసుకోవచ్చు.

Image result for ap govt logo

 అర్హతలు:  ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 45 శాతం) మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులూ అర్హులే. అయితే ప్రవేశ సమయానికి ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్ ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు అనర్హులు. ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్ చదివిన విద్యార్థులు ఆ మీడియం సీట్లకే అర్హులు.


వయసు:   2018, సెప్టెంబర్ 1 నాటికి 17 ఏళ్లు నిండాలి. గరిష్ట వయోపరిమితి లేదు. 

దరఖాస్తు రుసుం:  రూ.500.

దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్‌లో.

ఫీజు చెల్లింపు, దరఖాస్తుకు చివరి తేదీ:  ఏప్రిల్ 12, 2018. 

హాల్ టికెట్ల జారీ ప్రారంభం (ఆన్‌లైన్):  మే 11, 2018. 

డీఈఈసెట్ తేదీ:   మే 17, 18.

ఫలితాలు, ర్యాంకుల వెల్లడి: మే 28, 2018.

తొలిదశ కౌన్సెలింగ్: జూన్ 4 నుంచి 15 వరకు.

రెండో దశ కౌన్సెలింగ్: జూన్ 22 నుంచి 25 వరకు.

 

మరిన్ని వివరాలకి క్రింద ఉన్న లింక్ ఓపెన్ చేయండి..

వెబ్‌సైట్:  https://apdeecet.apcfss.in 

 


మరింత సమాచారం తెలుసుకోండి: