ఎయిర్ ఇండియాలో ఉద్యోగం చేయాలనుకునే యువతీ యువకులకి ఎయిర్ ఇండియా లిమిటెడ్ మంచి అవకాశాన్ని కలిగిస్తోంది...ఈ ఉద్యోగాలలో మహిళలకి ,పురుషులకి  విడివిడిగా  ఖాళీలని ప్రకటించారు.. మొత్తం “295” లకి దరఖాస్తులు కోరుతోంది.

Image result for air india recruitment 2018

మొత్తం ఖాళీలు:  295 (పురుషులకు- 86, మహిళలకు- 209. మొత్తం ఖాళీలను ఎక్స్‌పీరియెన్స్ క్యాబిన్ క్రూ, ట్రైనీ క్యాబిన్ క్రూ విభాగాల వారీగా విభజిస్తారు). అర్హత: ఎక్స్‌పీరియన్స్ క్యాబిన్ క్రూ ఉద్యోగాలకు ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు ఏడాది అనుభవం ఉండాలి. ఎయిర్‌బస్/బోయింగ్ ఫ్యామిలీ ఎయిర్‌క్రాఫ్ట్‌కు సంబంధించిన వ్యాలిడ్ ఎస్‌ఈపీ తప్పనిసరి.

వయసు:   18-35 ఏళ్ల మధ్య ఉండాలి. 

టైనీ క్యాబిన్ క్రూ ఉద్యోగాలకు డిగ్రీ లేదా ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు మూడేళ్ల డిగ్రీ/ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ/ట్రావెల్ టూరిజం పూర్తిచేసి ఉండాలి.


వయసు: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఫిజికల్ మెజర్‌మెంట్స్:  ఎత్తు: పురుషులు 172 సెం.మీ, మహిళలు 160 సెం.మీ.; బాడీ మాస్క్ ఇండెక్స్ పురుషులకు 18-25 మధ్య, మహిళలకు 18-22 మధ్య ఉండాలి. 

రాతపరీక్ష:   ఎక్స్‌పీరియన్స్ క్యాబిన్ క్రూలకు మే 6 న రాతపరీక్ష ఉంటుంది. ట్రైనీలకు పరీక్ష తేదీలను వెబ్‌సైట్లో ప్రకటిస్తారు. 

దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్‌లో 

దరఖాస్తుకు ఫీజు: రూ.1000

దరఖాస్తుకు చివరితేదీ: మే 2, 2018

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   www.airindia.in


మరింత సమాచారం తెలుసుకోండి: