భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన చండీగఢ్  లేబర్ బ్యూరో.. ప్రధానమంత్రి ముద్ర యోజన సర్వే (పీఎంఎంవై), ఏరియా ఫ్రేమ్ ఎంటర్‌ప్రైజస్ సర్వే (ఏఎఫ్‌ఈఎస్) పథకాల కోసం ఒప్పంద ప్రాతిపదికన 875 కన్సల్టెంట్, సూపర్‌వైజర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Image result for labour bureau recruitment 2018

ఒప్పంద  సమయం: పీఎంఎంవై పథకం- ఇన్వెస్టిగేటర్ పోస్టులకు 6 నెలలు, మిగతా అన్ని ఉద్యోగాలకు 8 నెలలు, ఏఎఫ్‌ఈఎస్‌కు 2019, మార్చి 31 వరకు.

కన్సల్టెంట్: 19
అర్హత: ఎకనామిక్స్/అప్లయిడ్ ఎకనామిక్స్/బిజినెస్ ఎకనామిక్స్/ఎకనామెట్రిక్స్/స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్స్/కామర్స్‌లో పీజీ ఉత్తీర్ణత. సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు 5 ఏళ్ల పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.

సూపర్‌వైజర్: 143 
అర్హత:ఎకనామిక్స్/అప్లయిడ్ ఎకనామిక్స్/బిజినెస్ ఎకనామిక్స్/ఎకనామెట్రిక్స్/స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్స్/కామర్స్‌లో పీజీ ఉత్తీర్ణత. సంబంధిత సబ్జెక్టులో ఉన్నత క్వాలిఫికేషన్‌తో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి. 

ఇన్వెస్టిగేటర్: 695
అర్హత:స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్‌లేదా ఎకనామిక్స్‌లో బీఏ/బీకాం/బీఎస్సీ/బీబీఈ ఉత్తీర్ణత. సంబంధిత సబ్జెక్టులో ఉన్నత క్వాలిఫికేషన్ ఉన్న వారికి ప్రాధాన్యం.

అసిస్టెంట్: 12
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. 

స్టెనోగ్రాఫర్: 6
అర్హత: 10+2 ఉత్తీర్ణతతో పాటు షార్ట్‌హ్యాండ్ (నిమిషానికి 80 పదాలు), టైప్ రైటింగ్ (నిమిషానికి 40 పదాలు) సామర్థ్యం ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేదీ: ప్రకటన వెలువడిన తేదీ (2018, జూన్ 24) నుంచి 10 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్http://labourbureaunew.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: