బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనే కోరికతో ఆ రంగాన్నే ఎంచుకుని ఎన్నాళ్ళ నుంచో పోటీ పరీక్షలకి సిద్దం అవుతున్న విద్యార్ధులకి ఐబీపీఎస్ శుభవార్త తెలిపింది దాదాపు 4102 ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది..

Education News

బ్యాంకుల వారీ ఖాళీలు: 

అలహాబాద్ బ్యాంక్-784, బ్యాంక్ ఆఫ్ ఇండియా-965, కెనరా బ్యాంక్-1200, కార్పొరేషన్ బ్యాంక్-84, యూకో బ్యాంక్-550, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-519.

అర్హత:  ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు:  2018, ఆగస్టు1 నాటికి 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. 1988, ఆగస్టు 2 - 1998 ఆగస్టు 1 మధ్య జన్మించి ఉండాలి. (ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్- సర్వీస్‌మెన్లకు ఐదేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్లు సడలింపు ఉంటుంది). 

దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు:  ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100, మిగిలిన వారికి రూ.600.

ఎంపిక విధానం:  ఆన్‌లైన్ (ప్రిలిమినరీ, మెయిన్స్) రాత పరీక్షల ఆధారంగా ఎంపిక చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తు ప్రారంభం:  ఆగస్టు 14, 2018.

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 4, 2018.

ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 2018, అక్టోబర్ 13, 14, 20, 21 తేదీల్లో.

ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్ తేదీ: నవంబర్ 18, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్www.ibps.in


మరింత సమాచారం తెలుసుకోండి: