తెలంగాణా ప్రభుత్వం ఈ మధ్యకాలంలో నిరుద్యోగుల కోసం వరుస వరుసగా నోటిఫికేషన్ లు ఇస్తోంది..వీటిలో ముఖ్యంగా తెలంగాణా ఆరోగ్య శాఖకి సంభందించిన నోటిఫికేషన్లు ఎక్కువగా ఉండటం గమనార్హం..అయితే తెలంగాణా ఆయుష్ లో రెగ్యులర్ ప్రాతిపదికన 117 మెడికల్ ఆఫీసర్,  లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 Jobs

పోస్టుల వివరాలు : 

మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద): 62 

అర్హత: ఆయుర్వేదలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు మెడికల్ ప్రాక్టీషనర్‌గా శాశ్వత రిజిస్ట్రేషన్ ఉండాలి. 

మెడికల్ ఆఫీసర్ (హోమియో): 36 

అర్హత:  హోమియోపతిలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు మెడికల్ ప్రాక్టీషనర్‌గా శాశ్వత రిజిస్ట్రేషన్ ఉండాలి. 

లెక్చరర్ (హోమియో): 11

అర్హత: హోమియోపతిలో పీజీ ఉత్తీర్ణతతో పాటు మెడికల్ ప్రాక్టీషనర్‌గా శాశ్వత రిజిస్ట్రేషన్ ఉండాలి. 

లెక్చరర్ (యునాని): 8

అర్హత: యునానిలో పీజీ ఉత్తీర్ణతతో పాటు మెడికల్ ప్రాక్టీషనర్‌గా శాశ్వత రిజిస్ట్రేషన్ ఉండాలి. 

వయసు: 18-43 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 18-47 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక: అకడమిక్ మార్కులు, పని అనుభవం, సంస్థ ఇతర నిబంధన ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు: రూ.600.

ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 5, 2018. 

దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 15, 2018. 

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్:   http://ayushrect2018.telangana.gov.in/


మరింత సమాచారం తెలుసుకోండి: