భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన గెయిల్ ఇండియా లిమిటెడ్..లో గేట్-2019 స్కోర్ ఆధారంగా ఎగ్జిక్యూటివ్ ట్రైనీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ లో ఎన్నో పోస్టులు ఉన్నాయి అనే వివరాలు ప్రకటించకపోయినా వెబ్సైటు ఆధారంగా ఆ వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.

 Image result for gail india logo

విభాగాలు: కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్.

అర్హత: సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ (బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత.

వయసు: 2019, మార్చి 13 నాటికి 28 ఏళ్లు మించకూడదు. (రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది).

ఎంపిక: గేట్-2019 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా. సంబంధిత విభాగాల్లో గేట్ స్కోర్‌ను పరిగణలోకి తీసుకుంటారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తుకు ప్రారంభతేదీ: 2019, ఫిబ్రవరి 12 నుంచి గేట్-2019 రిజిస్ట్రేషన్ నంబరు సాయంతో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 13, 2019.

గేట్ 2019 వివరాలు...

గేట్ పరీక్ష తేదీలు: 2019, ఫిబ్రవరి 2, 3, 9, 10.

ఫలితాల వెల్లడి: మార్చి 16, 2019. 

గమనిక: గేట్-2019 ఫలితాల వెల్లడి తర్వాత సంస్థ వివరమైన ప్రకటన జారీ చేస్తుంది. కానీ ఈ లోపు గేట్-2019 రిజిస్ట్రేషన్ నెంబర్ సాయంతో పై పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్www.gailonline.com


మరింత సమాచారం తెలుసుకోండి: