తమిళనాడులోని నవరత్న హోదా కలిగిన ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్, అనుబంధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 635 టెక్నీషియన్ అప్రెంటీస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ లో భాగంగా టీఏటీ, జీఏటీ విభాగాలలో వివిధ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చింది.

 Image result for nlc

పోస్టుల వివరాలు...
1. టెక్నీషియన్ అప్రెంటీస్ ట్రైనింగ్ (టీఏటీ): 335 (మెకానికల్ ఇంజనీరింగ్-120, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-100, సివిల్ ఇంజనీరింగ్-30, ఇన్‌స్ట్రుమెంటేషన్-15, కెమికల్ ఇంజనీరింగ్-15, మైనింగ్ ఇంజనీరింగ్-20, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్-20, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్-15). 
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి సంబంధిత ఇంజనీరింగ్ సబ్జెక్టులో కనీసం 55% (ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం) మార్కులతో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత.

2. గ్రాడ్యుయేట్‌ అప్రెంటీస్ ట్రైనింగ్ (జీఏటీ): 300 (మెకానికల్ ఇంజనీరింగ్-90, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-90, సివిల్ ఇంజనీరింగ్-30, ఇన్‌స్ట్రుమెంటేషన్-15, కెమికల్ ఇంజనీరింగ్-15, మైనింగ్ ఇంజనీరింగ్-20, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్-25, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్-15). 
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 55% (ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం) మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. 
గమనిక: ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, లక్షదీవులు ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు అర్హులు.

ఎంపిక: అకడమిక్ మార్కులు+ఇంటర్వ్యూ ఆధారంగా. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. 

దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 25, 2018. 

హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: అక్టోబర్ 30, 2018.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్www.nlcindia.com


మరింత సమాచారం తెలుసుకోండి: