ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రముఖమైన కెనరా బ్యాంక్ 800 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది..ఎంపికైన అభ్యర్థులు మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్-బెంగళూరు లేదా ఎన్‌ఐ టీటీఈ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్- గ్రేటర్ నోయిడాల్లో ఏదో ఒకచోట ఏడాది పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్స్ చదవాలి. కోర్సు పూర్తయిన తర్వాత ప్రొబేషనరీ ఆఫీసర్ (జేఎంజీఎస్-1) హోదాతో కెనరా బ్యాంక్‌లోకి తీసుకుంటారు. 

Jobs

మొత్తం ఖాళీలు: 800 (జనరల్-404, ఓబీసీ- 216, ఎస్సీ-120, ఎస్టీ-60). 

అర్హత: 60% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55% మార్కులుంటే సరిపోతుంది. 

వయసు: అక్టోబర్ 1, 2018 నాటికి 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; పీహెచ్‌సీలకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక: ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తు ఫీజు: రూ. 708. (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ.118).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తుకు చివరితేదీ: నవంబర్ 13, 2018.

పరీక్షతేదీ: డిసెంబర్ 23, 2018.

పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్- చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. 

తెలంగాణ- హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్:   www.canarabank.com

 


మరింత సమాచారం తెలుసుకోండి: