ఆంధ్రప్రదేశ్ హోంశాఖ పరిధిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 2723 ఖాళీల భర్తీకి ఏపీ పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది...ఈ నోటిఫికేషన్ లో భాగంగా పలు విభాగాలలో పోస్టుల భర్తీ చేపడుతోంది..పోలీస్ కానిస్టేబుల్(ఎస్‌సీటీ)(ఏఆర్)(ఏపీఎస్పీ).ఇలా   మొదలగు విభాగాలలో ఖాళీలని..ప్రకటించారు

 Jobs

విభాగాల వారీ ఖాళీలు:

పోలీస్ కానిస్టేబుల్ (ఎస్‌సీటీ)-మెన్/ఉమెన్: 1600

పోలీస్ కానిస్టేబుల్ (ఏఆర్) (ఎస్‌సీటీ)-మెన్/ఉమెన్: 300

పోలీస్ కానిస్టేబుల్ (ఏపీఎస్పీ) (ఎస్‌సీటీ)-మెన్: 300

వార్డర్స్-మెన్, ఉమెన్: 123

ఫైర్‌మెన్: 400.

అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. కానిస్టేబుల్, ఫైర్‌మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉంటే సరిపోతుంది. అయితే ఇంటర్ చదివి, పరీక్షలకు హాజరై ఉండాలి.
వయసు: జులై 1, 2018 నాటికి..

కానిస్టేబుల్ పోస్టులకు 18-22 ఏళ్ల మధ్య ఉండాలి. జులై 2, 1996 నుంచి జులై 1, 2000 మధ్య జన్మించి ఉండాలి.

ఏడాది కాలంగా హోంగార్డులుగా పనిచేస్తున్న వారికి మాత్రం 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. జులై 2, 1988 నుంచి జులై 1, 2000 మధ్య జన్మించి ఉండాలి.

వార్డర్, ఫైర్‌మెన్ పోస్టులకు 18-30 ఏళ్లు ఉండాలి. జులై 2, 1988 నుంచి జులై 1, 2000 మధ్య జన్మించి ఉండాలి. పై అన్ని పోస్టులకు నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
దరఖాస్తు ఫీజు: రూ.300 (ఎస్సీ, ఎస్టీలకు రూ.150).
ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్స్ రాత పరీక్షలు, దేహదారుఢ్య పరీక్షల ద్వారా. 
దరఖాస్తుకు చివరితేదీ: డిసెంబర్ 7, 2018.
పరీక్ష తేదీ: జనవరి 6, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:  http://slprb.ap.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: