భారతీయ రైల్వే నిరుద్యోగుల కోసం 1937 పారామెడికల్ కేటగిరిలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా వివిధ  రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న పోస్టులతో కూడిన వివరాలు వెల్లడించారు. ఈ పోస్టులు అన్నీ ఆయా రాష్ట్రాల ఆర్‌ఆర్‌బీల ద్వారా భర్తీ చేయనున్నారు.

 Jobs

ఆర్‌ఆర్‌బీల వారీ ఖాళీలు:  అహ్మదాబాద్-80, అజ్మీర్-89, అలహాబాద్-176, బెంగళూరు-51, భోపాల్-48, భువనేశ్వర్-35, బిలాస్‌పూర్-40, చంఢీగఢ్-197, చెన్నై-173, గోరఖ్‌పూర్-66, గువాహటి-117, జమ్మూ-శ్రీనగర్-70, కోల్‌కతా-236, మాల్దా-45, ముంబై-232, ముజఫర్‌పూర్-26, పట్నా-76, రాంచీ-38, సికింద్రాబాద్-112, సిలిగురి-30.

అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఎస్సీ, పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, ఇంటర్/తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: పోస్టులను బట్టి 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. 

ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు: రూ.500. రాయితీ వర్తించే వర్గాలకు రూ.250.

రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: ఏప్రిల్ 2, 2019.

దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 7, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://rrbsecunderabad.nic.in



మరింత సమాచారం తెలుసుకోండి: