ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (పైలట్, అబ్జర్వర్ స్పెషలైజేషన్లు), ఎడ్యుకేషన్ బ్రాంచ్, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (లాజిస్టిక్స్ కేడర్)లో 2020, జనవరిలో ప్రారంభమయ్యే కోర్సు ద్వారా ఇండియన్ నేవీలో ప్రవేశించేందుకు ప్రకటన విడుదలైంది.

 Image result for indian navy logo

అర్హత :   లాజిస్టిక్ పోస్టులకు సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్, ఎంబీఏ, బీఎస్సీ/బీకామ్/బీఎస్సీ (ఐటీ), పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్స్/లాజిస్టిక్స్/సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్/మెటీరియల్ మేనేజ్‌మెంట్ లేదా ఎంసీఏ/ఎంఎస్సీ (ఐటీ) ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎడ్యుకేషన్ పోస్టులకు విభాగాలను బట్టి ఎంఎస్సీ-ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్/న్యూక్లియర్ ఫిజిక్స్,ఎంఎస్సీ-మ్యాథ్స్/ఆపరేషన్స్ రీసెర్చ్, ఎంఎస్సీ-కెమిస్ట్రీ, ఎంఏ-ఇంగ్లిష్, ఎంఏ-హిస్టరీ, బీఈ/బీటెక్(మెకానికల్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.

 

వయసు

పైలట్,అబ్జర్వర్ పోస్టులకు జనవరి 2,1996 -జనవరి 1,2001 మధ్య జన్మించి ఉండాలి.

లాజిస్టిక్స్ పోస్టులకు జనవరి 2, 1995-జూలై 1, 2000 మధ్య జన్మించి ఉండాలి.

ఎడ్యుకేషన్ పోస్టులకు జనవరి 2, 1995-జనవరి 1, 1999 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.ఎంపిక: ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, పీఏబీటీ (పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్), మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా. శిక్షణ: 

ఎంపికైన వారికి ఎజిమల(కేరళ)లోని ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణ ఇస్తారు. అనంతరం నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం కల్పిస్తారు.అబ్జర్వర్ పోస్టులకు కూడా 22 వారాల నేవల్ ఓరియంటేషన్ కోర్సులో శిక్షణ ఉంటుంది. అనంతరం అబ్జర్వర్ స్కూల్‌లో సబ్ లెఫ్టినెంట్ టెక్ (ఎక్స్) కోర్సులో శిక్షణ తర్వాత ఉద్యోగ నియామకం ఉంటుంది.

 దరఖాస్తుకు చివరితేదీ:  ఏప్రిల్ 5, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్:  www.joinindiannavy.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: