భారత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బీఎస్‌ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) లో కమ్యునికేషన్ విభాగంలో  తాత్కాలిక ప్రాతిపదికన సుమారు 1072 హెడ్ కానిస్టేబుల్  పోస్టులకి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా పురష , మహిళా అభ్యర్ధుల నుంచీ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ఈ మొత్తం ఖాళీల్లో 25%  ఉద్యోగాలని  బీఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్న అభ్యర్దులకి గాను కేటాయించటం జరిగింది. మరిన్ని వివరాలలోకి వెళ్తే..

 Jobs

పోస్టుల వివరాలు..

హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) : 300

హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) : 772

అర్హత: పోస్టులను బట్టి గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ లేదా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక ప్రమాణాలుండాలి. 
వయసు: 2019, జూన్ 12 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: రాతపరీక్ష, పీఎస్‌టీ/పీఈటీ అండ్ డాక్యుమెంటేషన్, డిస్క్రిప్టివ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.100; ఎస్సీ, ఎస్టీ, మహిళలు, బీఎస్‌ఎఫ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తులు ప్రారంభం: మే 14, 2019.
దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 12, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్:    http://bsf.nic.in


మరింత సమాచారం తెలుసుకోండి: