నేషనల్ బ్యాంకింగ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్ ) ఉద్యోగ అవకాశ ప్రకటన విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో ఇప్పటికే ఉన్న వారికి ఈ ఉద్యోగాన్ని సొంతం చేసుకునే వీలు ఉంటుంది. నా బర్డ్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం. 87 మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది

 Current Affairs

పోస్టుల వివరాలు..

అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-ఏ):  79.

అర్హత:పోస్టులను బట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ/పీజీ/పీహెచ్‌డీ/సీఏ/కాస్ట్ అకౌంటెంట్/కంపెనీ సెక్రటరీ/పీజీ డిప్లొమా/ఎంబీఏ; బీఈ/బీటెక్, బీబీఏ/బీఎంఎస్ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు 45 శాతం మార్కులుంటే సరిపోతుంది. 
వయసు: 2019, మే 1 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; పీహెచ్‌సీలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. 

మేనేజర్ (గ్రేడ్-బి):  8. 
అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా కనీసం 55 శాతం మార్కులతో పీజీ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
వయసు: 2019, మే 1 నాటికి 21-35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఫేజ్-1 (ప్రిలిమినరీ), ఫేజ్-2 (మెయిన్) ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరితేదీ: మే 26, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్https://ibpsonline.ibps.in


మరింత సమాచారం తెలుసుకోండి: