మ‌హిళ‌ల సంక్షేమం కోసం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ ఇప్ప‌టికే అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నారు. మ‌రొక అడుగు ముందుకు వేసి అర్హ‌త క‌లిగిన బాలిక‌ల‌కు స్కూటీలు ఇవ్వాల‌నే ల‌క్ష్యంతో `స్యూటీ మోజ‌న‌` ప్ర‌వేశ‌పెట్టారు.  ప‌దో త‌ర‌గ‌తి త‌ర్వాత బాలిక‌లు ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించాల‌ని, ఎలాగైనా పై చ‌దువులు చ‌ద‌వ‌డం... ఆ త‌ర్వాత చిన్న‌పాటి ఉద్యోగాలు చేసేందుకు వెళ్లి రావ‌డానికి ఇబ్బందులు ప‌డుతున్నారు. 


ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి మోడీ `స్కూటీ యోజ‌న‌` ప‌థ‌కాన్ని సంబంధించి ఈ ఏడాది మే నెల‌లో శ్రీ‌కారం చుట్టారు. ఈ ప‌థ‌కంలో బాలిక‌లు, మ‌హిళ‌ల‌కు స్కూటీలు ఉచితంగా ఇవ్వ‌నున్నారు.  స‌ర్కార్ యోజ‌న వెబ్‌సైట్‌లోకి వెళ్లి స్కూటీ యోజ‌న‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తు నింపాలి. ప‌దో త‌ర‌గ‌తి మార్కుల జాబితా, రేష‌న్ కార్డు, ఆధార్‌, ఆధాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌తో పాటు ఎల్‌ఎల్‌ఆర్ లైసెన్స్ కూడా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుతో న‌మోదు చేయాలి.


అందుకు సంబంధంచి ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు కూడా జ‌త చేయాలి. ఈ నెల 30వ తేదీతో త‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ గుడువు ముగియ‌నుంది. అర్హ‌త ఉన్న వారికే స్కూటీ ఇస్తారు. ఒక కుటుంబంలో ఒక‌రికి మాత్ర‌మే అవ‌కాశం క‌ల్పిస్తారు. ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై ఉండాల్సి ఉంది. 18 నుంచి 40 సంవ‌త్స‌రాల లోపు ఉండాలి. ఆదాయం రూ. 2.50 ల‌క్ష‌ల లోపు ఉండాలి. ఆధార్‌, రేష‌న్ కార్డు, మార్కుల జాబితాలో ఒకే పేరు ఒకేలా ఉండాలి. ఏదైనా తేడా ఉంటే ద‌ర‌ఖ‌స్తూ తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: